సోషల్ మీడియాను షేక్ చేస్తున్న’సితార’ స్టెప్స్… దేవి శ్రీ పాట..!

0
158
Devisri prasad
Devisri prasad with sithra and adhya

‘మహర్షి’ సినిమా కోసం ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు దేవి శ్రీ ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ నెల 29 వ తేదీన మహర్షి నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలవుతుందంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఈ స్వీట్ గుడ్ న్యూస్ తో స్వీట్ సితారతో తాను చేసిన డాన్స్ కూడా షేర్ చేయడం విశేషం. రెండు రోజుల క్రితమే బాహుబలి లోని ‘కన్నా నిదురించరా’.. అంటూ సితార డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేంది. మహేష్ అభిమానులు థ్రిల్ గా ఫీల్ అయ్యారు.. ఆ థ్రిల్ లో నుండి బయటకు రాక ముందే, దేవి శ్రీ మరో డాన్స్ ను పోస్ట్ చేయడంతో నెటిజన్స్ లైక్స్ , షేర్ లతో సూపర్ స్టార్ జూనియర్ వచ్చేసిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ ‘శ్రీమంతుడు’ సినిమాలోని ‘ చారుశీల..’ అంటూ పాట పడుతుంటే.. పాటకు అనుగునంగా అదిరిపోయేలా స్టెప్స్ వేసింది సితార . మహేష్ బాబు కూతురు తో పాటు, ‘మహర్షి’ దర్శకుడైన వంశీ పైడిపల్లి డాటర్ ఆద్య కూడా జతకట్టింది. మధ్యలో దేవి పాడుతుంటే ఓ పక్క సితార, మరో పక్క ఆద్య స్టెప్స్ వేశారు. సితార పాప నాకు డాన్స్ నేర్పించిందంటూ.. అంటూ దేవి శ్రీ ప్రసాద్ షేర్ చేసిన వీడియో సామజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది.