‘మహర్షి’ దుబారా ఖర్చు సినిమా..! కత్తి మహేష్

0
104
kathi mahesh comments on maharshi movie

మహర్షి సినిమా గురువారం విడుదల కాగా.. సినిమా కు ప్రేక్షుకుల నుంచి వస్తున్న ఆదరణ ఒకలా ఉంటె.. విమర్శకుల నుంచి కామెంట్స్ ఇంకోలా ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత మెగా స్టార్ చిరంజీవి సైతం మూవీలోని డైలాగ్స్ చెబుతుంటే.. కత్తి మహేష్ లాంటి వాళ్ళు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మహేష్ సరసన నటించిన పూజ హెగ్డే గురించి కామెంట్ చేయడమే కాకుండా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వట్లేదు అన్నట్లు ఇండైరెక్ట్ లో తెలిపారు.

మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ‘మహర్షి’ చిత్ర హీరోయిన్ గూర్చి .. తన పేస్ బుక్ లో పూజ పేస్ కవలికలపై , నటన పై ఏకి పారేశాడు. ” ‘మహర్షి సినిమాలో ఒక బ్రేకప్ సీన్ ఉంటుంది. మన దారులు వేరు. గమ్యాలు వేరు. కాబట్టి ఇక్కడే విడిపోదాం అని హీరో అంటే, అతన్ని అమితంగా ప్రేమించే హీరోయిన్ షాక్ అయ్యి, బాధపడాలి. ఈ సినిమాలో హీరోయిన్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇప్పటివరకూ నేను చూసిన హీరోయిన్స్ లో ఎవరూ అంత అర్ధరహితమైన ముఖకవళిక చూపించి ఉండరు. అమ్మాయి చూడటానికి కుందనపు బొమ్మలాగా ఉంది. కానీ నటన…ఒక సుధీర్ఘ శూన్యం. ఈ నటనాక్షికి తెలుగు నిర్మాతలు దర్శకులు మంగళ హారతిపట్టి, కోట్ల రూపాయలు చదివించుకుని మళ్లీమళ్లీ బుక్ చేసుకుంటున్నారంట. ఎంత కక్ష తెలుగు ప్రేక్షకులు మీద!

ఇదే సినిమాకి ఇంగ్లీషులో రివ్యూ ఇస్తూ ఒక కుర్రాడు,”ఈ హీరోయిన్ బదులు అందమైన lamppost పెట్టినా బాగుండేది, బహుశా lamppost కి navel ఉండదని ఈ అమ్మాయిని పెట్టినట్టు ఉన్నారు” అని చాలా మర్యాదగా చెప్పాడు. నిర్మాణవ్యయం పెరిగింది కాబట్టి టికెట్ల రేట్లు పెంచుతున్నాం అనే నిర్మాతలు ఇలాంటి దుబారా ఖర్చులు, ప్రేక్షకుల మీద తీర్చుకునే కక్షలు మానేస్తే, సినిమాని బడ్జెట్లో తియ్యొచ్చు” అంటూ ఘాటైన కామెంట్ పోస్ట్ చేశాడు. దీనిపై పూజ ఎలా స్పందిస్తుందో చూడాలి.