మ‌హేష్-కొర‌టాల రిలేష‌న్ అంత‌గొప్ప‌దా.!

0
141

జూన్ 15వ తేదీ.. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొరటాల శివ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పెట్టిన పోస్ట్ టాలీవుడ్ లోనేకాదు, అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. కొర‌టాలతో మ‌హేష్‌కు ఇంత బాండింగ్ ఉందా అనిపిస్తోంది. తనకు ‘శ్రీమంతుడు’,’భరత్ అనే నేను’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందిన కొర‌టాల‌తో అప్ప‌ట్నుంచీ మంచి రిలేష‌న్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు మ‌హేష్.

త‌న అభిమాన ద‌ర్శ‌కుడి పుట్టిన రోజైన ఇవాళ మ‌హేష్ ఓ ఎమోషన్ ట్వీట్ చేసారు. “ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అత్యంత టాలెంట్,విజనరీ డైరెక్టర్ అయిన కొరటాల శివకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని చెవుతూ ఆప్యాయంగా అతన్ని హత్తుకొన్న ఓ ఫొటో ని పోస్ట్ చేశారు. ఇదే ఆ బ్యూటిఫుల్ పిక్.