‘గెలుపు’ కి కథలా మారిన మహేష్ .. ‘మహర్షి ‘ లిరికల్ సాంగ్ ..!

0
209
maharshi lyrical song

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. చిత్ర షూటింగు దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఒక ప్రధాన పాత్రలో నరేష్ నటిస్తున్నాడు. ఈ నెల మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయుటకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు చిత్ర బృందం . ఈ పరంగా చిత్ర ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ మొదలైంది. తాజాగా కొద్ది సేపటి క్రితమే రెండో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

“నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం.. నువ్వే నీ పంతం.. నువ్వేలే అనంతం.. ప్రతి నిశి మసై .. నీలో కసై దిసై అడుగేసేయ్ మిస్సేయిలులా.. ప్రతి సఖం సతం స్వప్నం ప్రతి యుగం యుగం నీ పేరే వినేంతలా గెలుపు నీ వెంటే పడేలా..” అంటూ కొనసాగే పాటలో మహేష్ బాబు విదేశాలలో ఒక కంపెనీ సీఈఓ గా స్టైలిష్ లుక్ లో కనిపించారు. శ్రీమణి సాహిత్యం , దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. యాజిన్ నజీర్ పాడిన పాటలో ఎంతో మీనింగ్ తో యూత్ ని ఆకర్శించేలా ఉంది. దిల్ రాజు, అశ్వనీదత్ , పీవీఆర్ నిర్మాణం వహిస్తున్నారు.