మహేష్ బాబు మైనపు విగ్రహంతో మహేష్ ఫ్యామిలీ

0
154
mahesh babu
mahesh babu wax figure launched in hydrabad

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రిన్స్ కున్న క్రేజ్ గుర్తించిన ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియం వారు అతని మైనపు విగ్రహాన్ని తయారు చేసారు. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్స్ మాత్రమే దక్కించుకున్న స్థానాన్ని టాలీవుడ్ లో ప్రభాస్ ఆ తరువాత ఇపుడు మహేష్ మాత్రమే కైవసం చేసుకున్నారు. కొద్దీ సేపటి క్రితమే మహేష్ అభిమానుల సందేశార్ధమై విగ్రహాన్ని హైదరాబాదుకి తరలించారు.

హైదరాబాద్ నగరం లోని  గచ్చిబౌలి  ఏఎంబీ సినిమాస్ లో  మహేష్ బాబు మైనపు విగ్రహం ప్రిన్స్ వాక్స్ ఫిగర్ ను మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ మెంబెర్స్ ఆవిష్కరించారు. అచ్చము మహేష్ బాబుల ఉన్న విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ప్రదర్శించనున్నారు. విగ్రహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రిన్స్ ఫాన్స్ తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహేశ్ , వారి కుటుంబ సభ్యులతో తరలి వచ్చారు. అక్కడికి వచ్చిన అభిమానులకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు కార్యక్రమ వేత్తలు. మహేష్ బాబు స్కేచ్ ఎవరైతే బాగా వేశారో వారికి మహేష్ బాబు మరియు మహేష్ వాక్స్ విగ్రహాముతో కలిసి ఫొటో దిగే అవకాశాన్ని కలిపించారు. ప్రదర్శన తర్వాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు విగ్రహాన్నితరలించనున్నారు.

ఈ పరంగా మహేష్ మాట్లాడుతూ ‘ సింగపూర్ టుస్సాడ్ మ్యూజియం వెళ్ళినపుడు మాఫ్యామిలీ అక్కడ విగ్రహాలను చూశాం. అంతే ఇక నా విగ్రహం కూడా ఉండాలని అనిపించింది. నేను అనుకున్నట్లు గానే విగ్రహము మ్యూజియం లో నెల కోల్పడం చాల ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం నా విగ్రహం చూసిన నా కుటుంబసభ్యుల ఆనందాలకు అవధులు లేవు. సింగపూర్ తరలించే వరకు ఇక్కడే ఉంటాము’ అని మహేష్ బాబు తెలిపారు.

mahesh babu
mahesh babu with mahesh babu wax figure