హీరో మ‌హేష్‌బాబు బ్యాంకు ఖాతాలు సీజ్‌..!

0
72

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబుకు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ షాకిచ్చింది. అయితే, గత తొమ్మిదేళ్ల నుంచి జీఎస్టీ క‌ట్ట‌కుండా ఎగవేస్తూ వ‌స్తున్న వారు త‌క్ష‌ణం చెల్లించాలంటూ ఇటీవ‌ల హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ఆదేశాలు జారీ చేయ‌డంతోపాటు నోటీసుల‌ను కూడా అంద‌జేసింది. ఆ క్ర‌మంలోనే మ‌హేశ్‌బాబుకు సైతం జీఎస్టీ క‌ట్ట‌లేదంటూ హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ నోటీసులు జారీ చేసింది.

అంతేకాకుండా, బుల్లితెర‌పై ప్ర‌సార‌మ్యే కొన్ని ప్రొడ‌క్ట్స్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల‌తోపాటు, ప్ర‌మోష‌న్ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా అందించిన‌సేవలకుగాను మహేష్‌బాబుకు లభించిన ఆదాయంపై పన్ను చెలించలేదని, తక్షణ మే పన్ను బకాయిలు చెలించాలని ఆ నోటీసులో హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మహేష్‌బాబుకు చెందిన యాక్సిష్, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్‌ల‌ను అధికారులు సీజ్ చేశారు.

అయితే, మ‌హేష్‌బాబు పన్నుతోపాటు జరిమానా వడ్డీతో సహా మొత్తం రూ. 73.5 లక్షలు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. కాగా, 2007-2008 సంవత్సరానికి సంబధించి వ్యాపార ప్రకటనలతో వచ్చిన ఆదాయంపై మహేష్ బాబు పన్ను చెలించలేదని తెలుస్తోంది. మొత్తం 18 లక్ష ల 50వేల రూపాయలు బకాయి పడినట్టు సమాచారం. దీంతో మహేష్ బాబుకు చెందిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను జీఎస్టీ కమిషనరేట్ సీజ్ చేశారు యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో మహేష్ కు రూ.73.5 లక్షల నగదు ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను బకాయిలకు సంబంధించి వడ్డీ పెనాల్టీ చెలించాల్సి ఉంది.