‘చెప్పు సిద్ధాంతం’ చెప్పిన కమల్ హాసన్..!

0
240
madurai court
kamal hassan

మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు  కమల్ హాసన్ చేసిన వివాద స్పద కామెంట్ తో చెప్పుదెబ్బల పాలయ్యాడు.. కేసుల పాలయ్యాడు.. కానీ ఇప్పటికి తాను మాట్లాడింది కరెక్ట్ అంటూ ఉదారణాలిస్తున్నాడు. ఆ మధ్య ‘తొలి తీవ్ర వాది ఎవరంటే హిందువేన‌ని’ పెద్ద ఎత్తున సంచలనమైన వాఖ్య చేశాడు. దీనికి ఉదాహరణగా గాంధీని హత్య చేసిన గాడ్సే అని చెప్పుకొచ్చాడు. అంతే ఇక ఈ మాట కాస్త పెద్ద దుమారం లేపింది. కేసులు వరకు వెళ్ళింది. కమల్ పై చెప్పులు విసిరిన పరిస్థితిలు వెలువడినాయి.

నిజం చెప్పాలంటే ఒక రకంగా తనకు జరిగింది అవమానకర విషయమైనా కూడా తాను ఏ మాత్రం తగ్గేది లేదని.. గాడ్సే మీద చేసిన కామెంట్ వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. కమల్ హాసన్ మాట్లాడుతూ… ‘హేరాం’ షూటింగ్ టైమ్ లో మహాత్మ గాంధీ గురుంచి రీసెర్చ్ చేయగా.. ఒక చెప్పు సిద్ధాంతం తెలుసుకున్నానని ఆ ఘటనను చెప్పారు.

గాంధీ ఒక సారి కిక్కిరిసిన ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నపుడు ఒక చెప్పు క్రింద పడిపోయిందట. ఆ క్షణం రెండో చెప్పును కూడా విసిరేసి.. ఎవరికో ఒకరికి ఈ రెండు చెప్పులు ఉపయోగ పడతాయి అని అన్నారట. తనకు జరిగిన సంఘటనకు, గాంధీజీ జీవితంలో జరిగిన సంఘటనను వల్లే వేస్తూ వివరించారు. దీని అంతరార్థం ఏమిటి అనేది మాత్రం తెలియట్లేదు.

ఒక చెప్పు విసిరిన వ్యక్తి రెండో చెప్పు విసరాల్సింది అని చెప్పారా? ఏది ఏమైనా చివరకు మాత్రం ‘గాంధీ నిజమైన హీరో.  గాడ్సే విల‌న్’.. సాటి హీరోగా విలన్ ని .. విలన్ లాగే చూస్తానంటూ ఇప్పటికి నేను అనిన మాట వెనకకి తీసుకునేది లేదని చెప్పేశారు.

ఈ పరంగా కమల్ హాసన్ పై కొంతమంది ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కమల్ హాసన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని ముందుగానే భావించిన కమల్ హాసన్ మదురై కోర్టు ని ముందస్తు జామీను కోసం  ఆశ్రయించారు. ఈరోజు కమల్ అర్జీని పరిశీలించి  ముందస్తు జామీను కోర్టు మంజూరు చేయడం జరిగింది.