జాతీయ పార్టీ లో ఎమ్మెల్యే టిక్కెట్ ని కైవసం చేసుకున్న యంగ్ హీరోయిన్ ..!

0
467
Madhavi latha
Tolly wood actor Madhavi latha gets MLA ticket

ఇంతకీ నువ్వెవరు… ? వరుసకు నాకెవ్వరు..? అంటూ నాని తో జోడి కట్టిన అమ్మడు మాధవీలత. ఈ భామ టాలీవుడ్ లోకి నచ్చావులే సినిమాతో అరంగేట్రం చేసింది. రామోజీరావు నిర్మించిన నచ్చావులే సినిమాతో ప్రేక్షకులను మెప్పించి అభిమానులను సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అవకాశాలను మాత్రం అంతగా చేజిక్కించుకోలేక పోయింది. అపుడపుడు సినిమాలలో నటిస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ‘మీ టూ ఉద్యమం’ లో కూడా తన గొంతు విప్పింది. తెలుగు కథానాయికలను కావాలనే అణగ తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటూ చాలా సార్లు వాపోయింది. దర్శక, నిర్మాతలు చెప్పినట్టు వింటూ, ప్రవర్తిస్తేనే ఆఫర్స్ ఇస్తారని సినీ పరిశ్రమలో ఆమె ఎదురుకొన్న లైంగిక వేధింపులను ఓపెన్ గా చెప్పింది.

గత కొంతకాలంగా మాధవిలతా బీజేపీ పార్టీ తరఫున గళాన్ని వినిపిస్తుంది. ఆదివారం బీజీపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది. ఇందులో బీజేపీ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుంచి మాధవికి టిక్కెట్ కేటాయించారు. ఇక ఈమె ఒక తెలుగమ్మాయి. ఈమె పుట్టింది, విద్యాభ్యాసము చేసిందంతా కర్ణాటక లోని బళ్లారి వద్ద. ఆ తరువాత తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టి సినిమాలు నటించింది. ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకుంది కానీ సినిమాలలో రాణించలేకపోయింది. ఇక రాజకీయ పరంగా అదృష్టం ఎలావుందో చెక్ చేసుకుంటుంది ముద్దుగుమ్మ.