రియాల్టీ షోలో సెలబ్రిటీల శృంగారం – దుప్ప‌ట్లోలో చెల‌రేగుతున్న దుమారం..!

0
1728

ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌తో సెల‌బ్రిటీలుగా మారిన కొంద‌రు ప్ర‌ముఖులు రియాల్టీ షోల‌లో వారి అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెడుతున్నారు. వారిని ప్ర‌ముఖుల‌ను చేసిన ప్ర‌జ‌ల‌కు మంచి విష‌యాల‌పై సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల్సింది పోయి వారే అడ్డ‌దారులు తొక్కుతున్నారు. ఆఖ‌ర‌కు తాము పాల్గొన్న రియాల్టీ షో ప్ర‌తి రోజు ప్ర‌సార‌మ‌వుతుంద‌ని, కోట్ల‌మంది ప్ర‌జ‌లు ఆ షోను వీక్షిస్తార‌న్న ఆలోచ‌న‌ను మ‌రిచి మ‌రీ రియాల్టీ షోలో ఏర్పాటు చేసిన గ‌దిలోనే శృంగార కార్య‌క‌లాపాల‌కు ముంద‌డుగేశారు. విచ్చ‌ల‌విడి ప్ర‌వ‌ర్త‌న‌తో వారి కామ‌వాంచ తీర్చుకునేలా దుప్ప‌ట్లో దూర‌డం గ‌మ‌నార్హం.

అయితే, ఇటీవ‌ల కాలంలో బుల్లితెర‌పై రియాల్టీ షోల‌కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల అభిరుచిని గ‌మ‌నించిన ప‌లువురు బిగ్‌బాస్‌, బిగ్ బ్ర‌ద‌ర్ వంటి షోల‌ను బుల్లితెర‌కు ప‌రిచ‌యం చేశారు. ఈ రెండు షోల మాదిరిగానే ల‌వ్ ఐలాండ్ అనే రియాల్టీ షోకు బ్రిట‌న్‌లో మాంచి క్రేజ్ ఉంది. బిగ్‌బాస్ షోలో ఉన్న‌ట్టే ఈ కార్య‌క్ర‌మంలోనూ మొత్తం 12 మంది సెల‌బ్రిటీలు ఉంటారు. ఈ ల‌వ్ ఐలాండ్ షో బ్రిట‌న్‌లోని ఫిజీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అయితే, బిగ్‌బాస్ మాదిరి ల‌వ్ ఐలాండ్ షోలో 12 మంది ఉన్నా అందులో ఆరుగురు పెళ్లికాని అబ్బాయిలు.. మ‌రో ఆరుగురు పెళ్లికాని అమ్మాయిలు ఉంటారు. మొద‌టి వారంలోనే ఒక‌రినొక‌రు ప‌రిచ‌యం చేసుకుని రెండు రోజుల త‌రువాత న‌చ్చిన వ్య‌క్తితో జ‌త‌క‌ట్టి జంట‌లుగా ఏర్ప‌డ‌తారు. అలా 12 మంది జంట‌లుగా ఏర్ప‌డి ఆరుగురుగా కౌంటింగ్‌లోకి వ‌స్తారు. ఇలా జంట‌లుగా ఏర్ప‌డిన వారం నుంచి వీరికి ఓటింగ్ జ‌రుగుతుంది. ఓటింగ్‌శాతం త‌గ్గిన వారు జంట‌గానే ఎలిమినేట్ అవుతారు. ఇలా చివ‌ర‌గా మిగిలిన జంట‌నే విజేత‌గా న్యాయ నిర్ణేత‌లు వెల్లడిస్తారు.

ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో ప్ర‌ముఖ ఛానెల్‌గా పేరొందిన ఐటీవీ2లో ల‌వ్ ఐల్యాండ్ రియాల్టీ షో ప్ర‌సార‌మ‌వుతోంది. ప‌లు ప‌త్రిక‌లు సైతం ఈ షోలోని మూడు జంట‌ల‌ను ప్ర‌ముఖంగా పేర్కొంటున్నాయి. వారిలో టమ్మీ ఫ్యూరీ(20), మోలీ మే హేగ్(20), మైకెల్ గ్రిఫిత్, అంబర్ గిల్ జంట, డ్యాన్నే విలియమ్స్, యెవండే బియలా జంటలు ఉన్నాయి.

రియాల్టీ షోలో భాగంగా ఆరు జంట‌ల కోసం ఏర్పాటు చేసిన స్లీపింగ్ రూముల‌ను ప్ర‌ధానంగా ఫోక‌స్‌చేస్తూ ఈ షో పాపుల‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక జంట‌ల విష‌యానికొస్తే, ఫ్యూరీ, మోలీ మే హేగ్ జంట‌కు హ‌ద్దు అనేదే లేకుండా పోయింది. చీక‌టిప‌డితే చాలు స్లీపింగ్ రూమ్‌లోకి వెళ్లి దుప్ప‌టి క‌ప్పుకుని మ‌రీ దుమ్ముద‌మారం చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఐటీవీ2 ప్ర‌ధానంగా పేర్కొంది. ఫ్యూరీ, మోలీ ఇద్ద‌రు కూడా ఒకే బెడ్‌ను షేర్ చేసుకుంటూ ముద్దులు, హ‌గ్గులతో శృంగారంలో ఆఖ‌రి ఘ‌ట్టానికి చేరుతూ చెల‌రేగిపోతున్నారు.

ఇక‌, మైకెల్ గ్రిఫిత్, అంబర్ గిల్ జంట, డ్యాన్నే విలియమ్స్, యెవండే బియలా జంట‌లు సైతం ఫ్యూరీ, మోలీలానే దుమ్ముదుమారం చేస్తున్నారు. ఇలా నిత్యం శృంగార కార్య‌క‌లాపాల‌నే ప్ర‌ధానంగా చేసుకుని కొన‌సాగిస్తున్న ఈ ల‌వ్ ఐలాండ్ రియాల్టీ షోపై నెటిజ‌న్లు పెద‌వి విరుస్తున్నారు. బుల్లితెర‌ను కేవ‌లం ఆ.. కోవ‌కు చెందిన వారే వీక్షించ‌ర‌ని, ఫ్యామిలీలు కూడా చూస్తార‌ని, అటువంట‌ప్పుడు ప్ర‌ధానంగా శృంగారాన్నే ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని, డ‌బ్బుల కోసం ఇలా రియాల్టీ షోను గ‌బ్బుప‌ట్టించొద్దంటూ నెటిజ‌న్లు ల‌వ్ ఐలాండ్ నిర్వాహ‌కుల‌కు చుర‌క‌లంటిస్తున్నారు.