మంత్రి నారా లోకేశ్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం..!

0
316

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. కాగా, మంగ‌ళ‌వారం రాత్రి గుంటూరు జిల్లా నిడ‌మ‌ర్రులో టీడీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి నారాలోకేశ్ పాల్గొన్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో ప్ర‌చారం ముగుస్తుంద‌న‌గా నిడ‌మ‌ర్రు సెంట‌ర్ ప్ర‌జ‌ల‌తో మాట్లాడేందుకు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. సెంట‌ర్‌లోని స‌ద్గుణ టిఫిన్ సెంట‌ర్ వ‌ద్దకు చేరుకున్న నారా లోకేశ్ ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా హోట‌ల్ హోర్డింగ్ నారా లోకేశ్‌పై ప‌డింది.

అయితే, టీడీపీ ముఖ్య‌నాయ‌కులంతా స‌ద్గుణ టిఫిన్ సెంట‌ర్ లోప‌ల‌ కొద్దిగా ఎత్తుగా ఉండ‌టంతో అక్క‌డే ఉండిపోయారు. నారా లోకేశ్ మాత్రం ప్ర‌జ‌ల‌తో మాట్లాడే క్ర‌మంలో టిఫిన్ సెంట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. అదే స‌మ‌యంలో హోర్డింగ్ ఊడి మంత్రి నారా లోకేశ్‌పై ప‌డింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన టీడీపీ శ్రేణులు హోర్డింగ్ నారా లోకేశ్‌పై ప‌డ‌కుండా పట్టుకున్నారు. దీంతో ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యింది.