లైవ్ అప్‌డేట్స్ : ప్ర‌స్తుతం ఆధిక్యంలో కొన‌సాగుతున్న పార్టీలు ఇవే..!

0
108

దేశ వ్యాప్తంగా, అలాగే ఏపీ వ్యాప్తంగా ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాలు ఎగ్జిట్‌పోల్స్ అంచ‌నాలు ఏవైతే ఉన్నాయో.., అవే నిజ‌మ‌య్యే ప‌రిస్థితులు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు అందిన స‌మాచారం మేరకు ఎన్డీయే 212 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతుండ‌గా, యూపీఏ 66 స్థానాల్లో మాత్ర‌మే ఆధిక్య‌త చూపుతోంది. ఇత‌రులు 65 స్థానాల్లో లీడింగ్‌లో కొన‌సాగుతున్నారు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికొస్తే, 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, రెండు స్థానాల్లో జ‌న‌సేన ఆధిక్యత క‌న‌బ‌రుస్తుంది. మొత్తానికి సార్వ‌త్రిక ఎన్నిక‌లు పూర్తైన నేప‌థ్యంలో విడుద‌లైన ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలే కంటిన్యూ అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.