లైవ్ అప్‌డేట్స్ : ఓట‌మి అంచున టీడీపీ మంత్రులు..!

0
123

వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు వార్ వ‌న్‌సైడ్‌గా క‌నిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర‌లో అయితే ఫ్యాన్ గాలి గిర్రున తిరుగుతోంది. ఉత్త‌రాంధ్ర‌లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధిక స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకునే దిశ‌గా ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. ఆఖ‌ర‌కు మంత్రులు కూడా గెల‌వ‌లేని ప‌రిస్థితి ఉత్త‌రాంధ్ర‌లో క‌నిపిస్తోంది. శ్రీ‌కాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు వెనుక‌బ‌డి ఉన్నారు. అలాగే విశాఖ జిల్లాలో నార్త్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు కూడా వెనుకంజ‌లో ఉన్నారు. న‌ర్సీప‌ట్నంలో మంత్రి అయ్య‌న్న పాత్రుడు కూడా ఫ‌లితాల్లో వెనుకంజ‌లో ఉన్నారు.