లైవ్ అప్‌డేట్స్ : క‌్లీన్ స్వీప్ దిశ‌గా వైసీపీ..! ఏ జిల్లాలో తెలుసా..?

0
131

ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల కౌంటింగ్ ఈ రోజు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాల‌లో లీడింగ్‌లో కొన‌సాగుతున్న పార్టీల లెక్క‌ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్డీయే – 283, యూపీఏ – 88, ఇత‌రులు – 75 స్థానాల్లో ఆధిక్య‌త‌ను కన‌బ‌రుస్తున్నాయి.

ఇక ప‌శ్చిమబెంగాల్‌లో అత్యంత కీల‌కమైన 20 స్థానాల్లో మ‌మ‌తా బెన‌ర్జీకి మ‌ద్ద‌తు ఇస్తుంటే, 11 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్య‌త‌ను చూపుతోంది. ఒక్క స్థానంలో మాత్ర‌మే ఇత‌రులు ఆధిక్య‌త‌లో ఉన్నారు.

అలాగే ఏపీ అసెంబ్లీ స్థానాల విష‌యానికొస్తే, ప‌ది ఎమ్మెల్యే సీట్లు ఉన్న శ్రీ‌కాకుళం జిల్లాలోని అన్ని స్థానాల్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధులు లీడింగ్‌లో విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్నారు.