జ‌గ‌న్‌లా మేం మాట‌లు చెప్పం : సోమిరెడ్డి

0
64

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌పై రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మ‌రొకసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తుంటే, అందుకు స‌హ‌క‌రించాల్సిన ప్ర‌తిప‌క్ష స‌భ్యులు అడ్డు త‌గ‌ల‌డం వారి రాజ‌కీయ దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి బ‌య‌ట‌కు వ‌చ్చేసింద‌ని, తాము చేసిన ఆ ప‌నికి ప్ర‌జ‌లు కూడా గ‌ర్విస్తున్నార‌న్నారు.

తాము ఏపీకి అన్యాయం చేసి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం బీజేపీతో అంట‌కాగుతున్నార‌న్నారు. వైసీపీ అధినేత జ‌గన్ బీజేపీతో చేస్తున్న దోస్తీని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని, అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీ బీజేపీ, వైసీపీల‌కు త‌మ ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌న్నారు.

ఏపీ అభివృద్ధిని వివ‌రిస్తూ సీఎం చంద్ర‌బాబు శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేస్తే, నిజాల‌ను జీర్నించుకోలేని వైసీపీ నేత రామ‌నారాయ‌ణ‌రెడ్డి బ్లాక్ పేప‌ర్‌ను విడుద‌ల చేస్తామంటూ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. ఆనం రామ‌నారాయ‌ణరెడ్డి సంవ‌త్స‌రానికో పార్టీ చొప్పున కండువాల‌ను మారుస్తున్నార‌ని, ఆయ‌న్ను ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.