నా భార్య‌ను ఎంపీగా గెలిపించుకుంటా : ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

0
142

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో తెలంగాణ వ్యాప్తంగా జ‌రిగిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏపీ సీఎం చంద్ర‌బాబు కాద‌ని, అందుకు చాలా కారణాలే ఉన్నాయ‌ని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అన్నారు. కాగా, బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నాడు జాతీయ స్థాయిలో ప్ర‌జ‌ల‌ ప్రయోజనాల దృష్ట్యా, లోకసభ ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు ఉండాల‌నే ఉద్దేశంతోనే పొత్తుపెట్టుకోవ‌డం జ‌రిగింద‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు.

ఆ క్ర‌మంలో చంద్రబాబు వ‌ల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం జరిగింద‌నే వాదన సరైంది కాద‌న్నారు. అంతేకాకుండా, తాను ఇప్ప‌టికే మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచాన‌ని, క‌నుక త‌న‌కు అవ‌కాశం ఇస్తే సీఎల్పీ నేత‌గా తానేంటో నిరూపించుకుంటాన‌న్నారు. ఈ విష‌యాన్నే టీకాంగ్రెస్ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి కుంతియాకు కూడా చెప్పడం జరిగింద‌న్నారు. ఒక‌వేళ త‌న‌ను సీఎల్పీ నేత‌గా ప్ర‌క‌టించని నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ఆదేశాల మేర‌కే న‌డుచుకుంటాన‌ని జ‌గ్గారెడ్డి.

అంతేకాకుండా, త్వ‌ర‌లో జర‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న భార్య‌కు కాంగ్రెస్ మెద‌క్ ఎంపీ టికెట్‌ను కేటాయిస్తే గెలిపించుకుంటాన‌ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవ‌రు కూడా తెరాస‌లో చేరే అవ‌కాశమే లేద‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.