న‌టుడు మోహ‌న్‌బాబుకు మ‌ళ్లీ లీగ‌ల్ నోటీసులు..!

0
175

చెక్‌బౌన్స్ కేసులో త‌న‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచి టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని వైవీఎస్ చౌద‌రి ఆరోపించారు. కాగా, వైవీఎస్ చౌద‌రి త‌న లాయ‌ర్ ద్వారా మోహ‌న్‌బాబుకు లీగ‌ల్ నోటీసులు పంపిన సంగ‌తి తెలిసిందే.

మోహ‌న్‌బాబు ఇంటిని ఆనుకుని ఉన్న అర ఎక‌రం స్థ‌లాన్ని తాము కొన్నామ‌ని, అయితే చెక్ బౌన్స్ కేసు తీర్పు త‌రువాత ఆ స్థ‌లంలోకి త‌న‌ను, త‌న మ‌నుషుల‌ను వెళ్ల‌నీకుండా అడ్డుకుంటున్నార‌ని చౌద‌రి ఆరోపించారు. తాను క‌ష్టార్జితంతో కొనుక్కున్న స్థ‌లం విష‌యంలో మోహ‌న్‌బాబు అడ్డంకులు సృష్టించ‌డంతో వైవీఎస్ చౌద‌రి శాశ్వ‌త ప‌రిష్కారం కోసం న్యాయ నిపుణుల స‌ల‌హాలు తీసుకుని మోహ‌న్‌బాబుకు లీగ‌ల్ నోటీసులు పంపించారు.