లారెన్స్‌తో విడాకులు – అస‌లు విష‌యం చెప్పిన హీరోయిన్‌..!

1
490

అస‌లే సినిమా ద‌ర్శ‌కుడు.. పెళ్లి చేసుకుంటే కంట క‌న్నీరు రాకుండా జీవితాతం సంతోషంగా చూసుకుంటాడు.. అన్న ఊహాలోకంలో విహ‌రిస్తూ పెళ్లి చేసుకుంది ఓ హీరోయిన్. అయితే, భ‌ర్త స్థానంలో ఉన్న‌ ద‌ర్శ‌కుడు మాత్రం హీరోయిన్ ఊహ‌ల‌కు స్వ‌స్తి ప‌లుకుతూ మొద‌టి రోజు నుంచే వేధింపుల‌కు గురి చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఏకంగా హీరోయిన్ న‌గ్నంగా ఉన్న ఫోటోల‌ను తీసి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ ద‌ర్శ‌కుడి వేధింపులు తీవ్రం కావ‌డంతో ఆ హీరోయిన్ విడాకుల కోసం కోర్టును ఆశ్ర‌యించి భ‌ర్త నుంచి విడాకులు పొందింది.

ఇక అస‌లు విష‌యానికొస్తే, మ‌ల‌యాళ‌ న‌టి ప్రియాంక ప‌లు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగ‌తి తెలిసిందే. అదే సమయంలో 2012లో ద‌ర్శ‌కుడిని లారెన్స్ రావ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రియాంక పెళ్లి జరిగిన కొన్ని రోజులు కాపురం సజావుగానే సాగింది. వీరి ప్రేమ పెళ్లికి గుర్తుగ ముకుందరామ్ అనే కొడుకు కూడా జన్మించాడు. అంతలోనే ఎం జరిగిందో కానీ న‌టించ‌డము ఇష్టం లేదంటూ వేధించేవాడట. ఇలా వీరి మధ్య విభేదాలు రావ‌డంతో భ‌ర్త‌కు విడాకులిచ్చింది. కానీ ఆ సమయంలో ఎందుకు విడాకులు ఇచ్చిందో ప్రేక్షకులకు అర్ధం కాలేదు.

తాజాగా అసలు విషయాన్ని న‌టి ప్రియాంక వెల్ల‌డించింది. త‌న న‌గ్న ఫోటోల‌ను భ‌ర్త లారెన్స్ రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, అందుకే ఆయనతో కాపురం చేయలేక విడాకులు తీసుకున్నట్లు ఓ ఇంట‌ర్య్వూలో అసలు విషయాన్ని బయట పెట్టింది.

భార్యగా కాకపోయినా, ఆడవాళ్లను ఎలా గౌరవించడం కూడా తెలియ‌ని అత‌నితో కాపురం చేయ‌డం ఇష్టం లేకనే విడాకులు తీసుకొని ఒంటరిగా బ‌తుకుదామ‌ని నిర్ణ‌యించుకున్నానంటూ స్పష్టం చేసింది. ఇది ప్రేక్షకులను ఒక పక్క కంట తడి పెట్టించినా, ప్రియాంక విడాకులు తీసుకోవడం సరైన నిర్ణయంగా మలయాళ ప్రేక్షకులు భావిస్తున్నార‌ట‌.