సుత్తితో కొట్టినా ప‌గ‌ల‌ని గుడ్డు..!

0
275

అత్యంత క్లిష్ట‌మైన మంచుకొండ‌ల‌కు నిల‌య‌మైన సియాచిన్‌లో చ‌లి చంపేస్తోంది. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా శ‌త్రువుల చేతుల్లో కాకుండా చ‌లిచేతుల్లోనే మృత్యువాత ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. అటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోను భార‌త జ‌వాన్లు వారి వారి విధుల‌ను ఎంతో బాధ్య‌త‌గా నిర్వ‌ర్తిస్తున్నారు.

దేశ స‌రిహ‌ద్దుల్లో స‌వాళ్ల‌ను చేదించ‌డం అల‌వాటుగా మార్చుకున్న మ‌న సైనికులు, వారు ఎదుర్కొంటున్న వాస్త‌వ ప‌రిస్థితిని ఓ వీడియో ద్వారా దేశ ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు క‌ట్టారు. చ‌లి ధాటికి ఓ జ్యూస్ ప్యాకెట్‌లోని జ్యూస్ అంతా గ‌డ్డ‌క‌ట్టుకుపోయింది. ప్యాకెట్‌లో గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన జ్యూస్ ద్ర‌వంలా మారాలంటే వేడిచేసి, క‌రిగిన త‌రువాత‌నే తాగాలి.

ఆఖ‌ర‌కు కోడిగ్రుడ్డులు కూడా చ‌లికి గ‌డ్డ‌క‌ట్టుకుపోయాయి. ఎంత‌లా అంటే సుత్తితోకొట్టినా ప‌గ‌ల‌నంత‌లా అన్న‌మాట‌. టేబుల్‌పై విసిరికొట్టినా, సుత్తితోకొట్టినా ప‌గ‌ల్లేనంత గ‌ట్టిగా త‌యార‌య్యాయి. ట‌మోటాలు, ఆలుగ‌డ్డ‌ల ప‌రిస్థితి కూడా ఇంతే. చుట్టూ మంచుతో క‌నిపించే సియాచిన్‌లో కూర‌గాయ‌ల ప‌రిస్థితే ఇలా ఉంటే ఇక తాగునీటి ప‌రిస్థితి ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు.