ఐదుగురిపై వెనుక నుంచి శృంగారం – 615 ఏళ్ల జైలు శిక్ష..!

0
6565

అత‌డి టార్గెట్ 16 ఏళ్లలోపు అమ్మాయిలే. ఆ వ‌య‌సు పైబ‌డిన వారు ఎంత అందంగా ఉన్నా వారి జోలికిపోడు. కానీ 16 ఏళ్లలోపు వారు ఒంట‌రిగా త‌న కంట‌ప‌డితే అత‌డిలోని కిరాత‌కుడు నిద్ర లేస్తాడు. వారిని వెంబడిస్తాడు.. వేటాడుతాడు. త‌న‌మాట విన‌క‌పోతే క‌త్తుల‌తో బెదిరించి, ర‌క్కి మ‌రీ వారిపై అత్యాచారానికి ఒడిగ‌డుతాడు. ఇంత‌టి దారుణాల‌కు పాల్ప‌డే ఈ మృగాడికి మ‌రో దురాల‌వాటు కూడా ఉంది. అదే తాను అత్యాచారానికి పాల్ప‌డే అమ్మాయిల‌తో వెనుక నుంచి శృంగారంలో పాల్గొంటాడు.

ఇలా ఎవ‌రికంటా ప‌డ‌కుండా వ‌రుస అత్యాచారాలు చేసుకుంటూ వ‌స్తున్న ఈ దుష్టుడు ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు. పోలీసులు వారి స్టైల్లో విచారించిన అనంత‌రం కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. నిందితుడు చేసిన నేరాల‌ను విన్న కోర్టు జ‌డ్జీ క‌న్నీరుపెట్టి.. ప్ర‌పంచంలో ఇంత వ‌ర‌కు ఎవ్వ‌రికీ వేయ‌ని శిక్ష విధించారు. చ‌ట్టాల్లోని లొసుగుల‌ను అడ్డుపెట్టుకుని బ‌య‌ట‌కు రాకుండా విధించాల్సిన అన్ని నిబంధ‌న‌ల‌ను జ‌డ్జీ త‌న తీర్పులో వెలువ‌రించారు.

ఏకంగా తీర్పు చెప్పే జ‌డ్జీకే క‌న్నీరు తెప్పించిన ఈ సంఘ‌ట‌న అలబామాలోని హూస్ట‌న్ కౌంటీలో జ‌రిగింది. సంఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. హోస్ట‌న్‌కౌంటీకి చెందిన రెవెన్ స్మిత్ (35) గుట్టుచ‌ప్పుడు కాకుండా 16 ఏళ్ల వ‌య‌సుగ‌ల ఐదుగురు అమ్మాయిల‌పై అత్యాచారాని పాల్ప‌డిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో నిజ నిర్ధార‌ణ అయింది.

అయితే కోర్టుముందు హాజ‌రుప‌రిచిన అనంత‌రం నిందితుడు రెవెన్ స్మిత్ జ‌డ్జీ ముందు మాట్లాడుతూ తాను చేసింది త‌ప్పేన‌ని, ఇక‌పై తాను స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో న‌డుచుకుంటాన‌ని, బాధితుల‌కు త‌న త‌రుపున క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నానని, త‌న‌ను ద‌య‌ద‌ల‌చి విడిచిపెట్టాలంటూ విన్న‌వించాడు.

అయితే ఓ బాధితురాలి త‌ల్లి కోర్టులో మాట్లాడుతూ రెవెన్ స్మిత్ బాధితులు చాలా మందే ఉన్నార‌ని, వారంతా 16 ఏళ్ల‌లోపు అమ్మాయిలే కావ‌డంతో ముందుకొచ్చి వివ‌రాలు చెప్ప‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ని చెప్పింది. ఇటువంటి నీచుడ్ని బ‌య‌టి ప్ర‌పంచంలోకి వ‌దిలితే మ‌రిన్ని అరాచ‌కాలు జ‌రుగుతాయ‌ని, ద‌య‌చేసి నిందితుడు రెవెన్ స్మిత్‌ను ఎట్టి ప‌రిస్థితిలోను వ‌ద‌ల‌కుండా క‌ఠిన శిక్ష‌లు విధించాల‌ని వేడుకుంది.

త‌న కూతురిపై రెవెన్ స్మిత్ రాక్ష‌సుడిలాప‌డి అత్యాచారం చేశాడ‌ని, ఆ విష‌యం త‌న కుమార్తెను చూస్తే తెలుస్తుందంటూ క‌న్నీరు మున్నీరుగా విల‌పించింది. బాధితురాలి త‌ల్లి చెప్పిన విష‌యాలు విన్న జ‌డ్జీసైతం కంట‌త‌డి పెట్టారు. కాసేటి త‌రువాత తేరుకున్న జ‌డ్జీ క‌న్నీటిని తుడుచుకుంటూ రెవెన్ స్మిత్‌కు 615 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.