ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే కూతురు..! ( వీడియో)

0
224

ప్రేమ వివాహం చేసుకున్న ఓ ఎమ్మెల్యే కుమార్తె త‌న తండ్రి నుంచి కాపాడ‌మ‌ని పోస్టు చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బిథారి చేన్పూర్ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా అజితేష్ కుమార్ అనే వ్య‌క్తిని ప్రేమించింది. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌నుకున్నా.. కానీ కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేదు. మ‌రిచిపొమ్మంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే త‌మ ప్రేమ కోసం త‌ల్లిదండ్రుల‌ను ఎదిరించేందుకు నిర్ణ‌యించుకున్న సాక్షి మిశ్రా ధైర్యంగా ఇంట్లో నుంచి బ‌య‌ట‌ప‌డి కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంది. అప్ప‌ట్నుంచే ఆ దంత‌ప‌లుకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు తామున్న ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఓ వీడియో విడుద‌ల చేసింది. ఆ వీడియో ఇప్ఉడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

త‌మ ప్రాణాలు తీసేందుకు త‌మ తండ్రి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఆరోపించింది. ఓ హోట‌ల్ ద‌గ్గ‌ర ఆగి ఉన్న ఇద్ద‌రిపై దాడి చేసేందుకు తండ్రి స్నేహితుడైన రాజీవ్ రాణా మ‌నుషుల‌ను తీసుకొచ్చాడ‌ట‌. అదృష్ట‌వ‌శాత్తు అక్క‌డ్నుంచి త‌ప్పించుకోగ‌లిగామ‌ని, లేకుంటే ప్రాణాలు పోయేవ‌మ‌ని సాక్షి మిశ్రా చెబుతోంది. త‌న‌కు, త‌న భ‌ర్త‌కు ఏదైనా ప్రాణ హాని జ‌రిగిందంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం తండ్రి, అత‌ని సోదరుడు, స్నేహితులేనంటూ సాక్షి మిశ్రా వీడియోలో చెప్పుకొచ్చింది. ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిగా పోలీసుల‌ను కోరుతూ సోష‌ల్ మీడియాలో పెట్టిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.