ప‌న్ను ఎగ‌వేత దారుల‌కు ఇక చుక్క‌లే..!

0
112

భార‌త ఐటీశాఖ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ప‌న్నులు ఎగ‌వేసి దొరికితే జ‌రిమానాలు చెల్లించి త‌ప్పించుకు తిరిగేందుకు వీలులేకుండా ఐటీశాఖ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లులోకి తెచ్చింది. ఈ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల విధానాల ప్ర‌కారం తీవ్ర నేర కేసుల్లో ఇరుక్కున్న వారికి ఊర‌ట ల‌భించే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు తొల‌గిపోయాయి.

మ‌నీ లాండ‌రింగ్‌, ఉగ్ర‌వాదుల‌కు ఆర్థిక స‌హ‌కారం, అవినీతి, బినామీ ఆస్తుల జ‌ప్తు, అప్ర‌క‌టిత విదేశీ ఆస్తులు వంటి కేసుల్లో ఊర‌ట‌నిచ్చే అంశాల‌ను ఐటీశాఖ విడుద‌ల చేసిన కొత్త నిబంధ‌న‌లు దూరం చేశాయి. దీంతో జ‌రిమానాలు చెల్లించి ఐటీ ఎగ‌వేత కేసుల నుంచి త‌ప్పించుకోలేరు. ఈ మేర‌కు ప్ర‌త్య‌క్ష ప‌న్నుల కేంద్రం తేల్చి చెప్పింది. స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాలు త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి రానున్న‌ట్లు తెలిపింది. అంతేకాకుండా కొత్త నిబంధ‌న‌ల‌ను అంద‌రికి తెలియ‌జేసేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సీనియ‌ర్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.