రెండోసారి గర్భ‌వ‌తిని చేసి వ‌దిలించుకోవాల‌ని చూస్తున్నాడు..!

0
394

ప్రేమ పేరుతో మ‌రో యువ‌తి మోస‌పోయిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని రెహ్మ‌త్‌న‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. ప్రేమించాన‌ని చెప్పి ఓ మాయ‌గాడు యువ‌తిని మోసం చేశాడు. ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవ‌డ‌మే కాకుండా, గ‌ర్భ‌వ‌తి అయిన త‌రువాత ఆ మాయ‌గాడు మొఖం చాటేశాడే. దీంతో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ బాధితురాలు మీడియాను ఆశ్ర‌యించింది.

సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. యూస‌ఫ్‌గూడ రెహ్మ‌త్‌న‌గ‌ర్‌కు చెందిన మంజుకు వెంక‌ట్ అనే యువ‌కుడు ప‌రిచ‌యం అయ్యాడు. వీరిద్ద‌రి పరిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రు అంగీకారంతోనే ఓ గుడిలో ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నాడు. హైద‌రాబాద్‌లో కాపురం కూడా పెట్టేశారు.

అయితే, పెళ్లైన‌ప్ప‌ట్నుంచి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. అంతేకాకుండా గ‌ర్భ‌వ‌తి అయిన మంజుకు వెంక‌ట్ బ‌లవంతంగా ఆప‌రేష‌న్ కూడా చేయించాడు. అబార్ష‌న్ చేయించుకోన‌ని చెప్పిన మంజును చిత్ర హింస‌ల‌కు గురి చేశాడు. ఇప్పుడు మంజు మ‌ళ్లీ గ‌ర్భ‌వ‌తి అయింది.

ఇదిలా ఉండ‌గా, పెద్ద‌లంద‌రి ముందు మ‌ళ్లీ త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని మంజు వెంక‌ట్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అప్ప‌ట్నుంచి వెంక‌ట్ త‌ప్పించుకు తిరుగుతున్నాడ‌ని బాధితురాలు మంజు మీడియాకు తెలిపింది. దీంతో త‌న‌కు న్యాయం చేయాలంటూ బాధితురాలు మంజు జూబ్లీహిల్స్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.