ప్రియుడి మోజులో భ‌ర్త మ‌ర్మాంగాల‌పై.. అతి దారుణంగా..!

0
275

న‌ల్గొండ జిల్లా సాలిగౌరారం మండ‌లం చిత్త‌లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను అతి దారుణంగా హ‌త‌మార్చింది. గ‌త ప‌ది రోజుల క్రితం చైత‌న్య‌పురి కాల‌నీలోనూ ఇదే త‌ర‌హాలో సోమ‌కేశ‌వులు అనే వ్యక్తి హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఆ సంఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే చిత్త‌లూరులో మ‌రో ఉదంతం వెలుగు చూడటం గ‌మ‌నార్హం.

చిత్త‌లూరులో చోటుచేసుకున్న ఈ దారుణ హ‌త్య‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. గుండెబోయిన మ‌ల్లేష్ (35), మ‌మ‌త భార్యా భ‌ర్త‌లు. వీరికి ఒక పాప కూడా ఉంది. సోమ‌కేశ‌వులు హ‌త్యా ఉదంతాన్ని త‌ల‌పిస్తూ మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి మ‌ల్లేష్ త‌న న‌ట్టింట్లో విగ‌తజీవిగా క‌నిపించాడు. పోలీసుల‌కు స‌మాచారం తెలియ‌డంలో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మ‌ల్లేష్ మృతిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

భార్య‌పైనే అనుమానాల‌న్నీ..!

మ‌ల్లేష్ మృతికి ముఖ్య కార‌ణం భార్య మ‌మ‌తేన‌ని ఆయ‌న త‌మ్ముడితోపాటు చిత్త‌లూరు గ్రామ‌స్తులు చెబుతున్నారు. మ‌మ‌త గ‌త కొన్ని రోజులుగా వేరే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం నెరుపుతుంద‌ని, వారి అక్ర‌మ సంబంధానికి మ‌ల్లేష్ అడ్డొస్తున్నాడ‌ని ఆయ‌న్ను తాగుడుకు బానిస చేసింద‌ని వారు పేర్కొంటున్నారు. చివరాఖ‌ర‌కు భ‌ర్త అడ్డును పూర్తిగా తొల‌గించుకునేందుకు ప్లాన్ చేసి మ‌రీ న‌ట్టింట్లో హ‌త్య‌కు ఒడిగ‌ట్టింద‌ని చెబుతున్నారు. మృతుడు మ‌ల్లేష్ మ‌ర్మాంగాల‌పై తీవ్ర గాయాలను పోలీసులు గుర్తించారు.