15 ఏళ్ల యువ‌తి చేతులు, కాళ్లు క‌ట్టేసి..!

0
211

తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ‌లో మృగాళ్లు అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. రాగంపేట‌కు చెందిన 15 ఏళ్ల యువ‌తి అదే ప్రాంతానికి చెందిన పృథ్వీ అనే యువ‌కుడిని ప్రేమించింది. సోమ‌వారం రాత్రి ఆమెను బీచ్‌కు వెళ్దామ‌ని మాయ‌మాట‌ల‌తో నిర్జీవ ప్ర‌దేశానికి పృథ్వీ తీసుకెళ్లాడు. అక్క‌డ ఆ మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేసేందుకు య‌త్నించాడు.

అయితే, ఆ యువ‌తి ప్ర‌తిఘ‌టించ‌డంతో స్నేహితుల సాయం తీసుకున్నాడు. వాసుప‌ల్లి సాయి, శ్యామ్‌కుమార్, నీల‌పు సాయితో క‌లిసి పృథ్వీ మైన‌ర్ బాలిక చేతులు, కాళ్ల‌ను తాళ్ల‌తో క‌ట్టేసి అత్యాచారం చేశారు. మ‌రోప‌క్క‌, నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు పోలీసుల చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన క‌థ‌నం మేర‌కు..
పృథ్వీ, ఆ 15 ఏళ్ల యువ‌తి ఇద్ద‌రు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వార‌ని, అంతేకాకుండా పృథ్వీని పెళ్లిచేసుకోవాల‌న్న ఉద్దేశంతో ఆ యువ‌తి శారీర‌క సంబంధం కూడా పెట్టుకుంద‌ని పోలీసులు తెలిపారు. అయితే, ఈ అమ్మాయిని రాగంపేట‌కు ద‌గ్గ‌ర‌లోనే ఉన్న గ్రౌండ్‌ను ఆనుకుని ఉన్న ఇంట్లోకి పృథ్వీ తీసుకెళ్లాడని, ఆ ఇంట్లో పృథ్వీ స్నేహితుడు బాబీ అనే వ్య‌క్తి కుటుంబం ఉంటుంద‌ని, బాబీ భార్య ఇంట్లో లేద‌ని తెలుసుకున్న పృథ్వీ త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న 15 ఏళ్ల యువ‌తిని తీసుకెళ్లి త‌న ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి అత్యాచారానికి ఒడిగ‌ట్టార‌ని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు న‌లుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్టు పోలీసులు చెప్పారు.