పాడుప‌నికి ఒప్పుకోలేద‌ని వివ‌స్త్ర‌ను చేసి.. బ్లేడ్‌ల‌తో కోసి.. ఆపై..!

0
207

వెండి తెర‌పై వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుని ఓ వెలుగు వెలిగిపోవాల‌ని క‌ల‌లు కంది. క‌ల‌లు క‌న‌డ‌మే కాకుండా అటుగా ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. సినిమా ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నించింది. త‌న ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌తిఫ‌లంగా అవ‌కాశాలు వ‌చ్చినా అవి అర‌కొర మాత్ర‌మే. దీంతో పొట్ట గ‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మైంది. దీంతో చేసేదిలేక ప‌బ్‌లో డ్యాన్స‌ర్‌గా చేరింది.

వెండితెర‌ను వ‌ద‌లుకుని ప‌బ్‌ను న‌మ్ముకున్న ఆ యువ‌తి జీవితం అక్క‌డా సాఫీగా సాగ‌లేదు. ప‌బ్‌కు వ‌చ్చే కొంద‌ర ఉతాగుబోతులు తాగిన మైకంలో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. కోరిక తీర్చాలంటూ వేధించారు. కామాంధుల కోరిక‌ల‌ను పెడ‌చెవిన పెట్టిన ఆ యువ‌తి వాటిని ప‌ట్టించుకోకుండా త‌న‌ప‌ని తాను చేసుకుపోయేది.

అలా త‌న జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆ యువ‌తిని ప‌బ్ యాజ‌మాన్యం సైతం వేధింపుల‌కు గురిచేయ‌డం ప్రారంభించింది. ప‌బ్‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల కామ కోరిక తీర్చాలంటూ ఆ యువ‌తిపై ఒత్తిడి తెచ్చారు. ఓ రాత్రి వారితో గ‌డిపారా, ఒక్క రాత్రికి రూ.10వేలు అంటూ న‌చ్చచెప్పేందుకు ప్ర‌య‌త్నించారు.

తీరా ఆ పాడుప‌నికి యువ‌తి అంగీక‌రించ‌క‌పోయే స‌రికి త‌ర‌చూ ఫోన్‌లు చేసి మ‌రీ అస‌భ్య‌క‌ర చేష్ట‌ల‌తో, సూటిపోటి మాట‌ల‌తో వేధించ‌డం ప్రారంభించారు. ఇక ఏం చేయాలో పాలుపోని ఆ యువ‌తి చివ‌రాఖ‌ర‌కు పోలీసులను ఆశ్ర‌యించింది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల బేగంపేట‌లో చోటు చేసుకుంది.

బేగంపేట పోలీసులు తెలిపిన స‌మాచారం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. త‌మ పీఎస్ ప‌రిధిలోని లెస్బ‌న్ ప‌బ్‌లో హ‌రిణి అనే యువ‌తి ప‌బ్ డ్యాన్స‌ర్‌గా ప‌నిచేస్తుంద‌ని పోలీసులు తెలిపారు. శ‌నివారం రాత్రి కొంద‌రు వ్య‌క్తులు హ‌రిణిని నడిరోడ్డుపై వివ‌స్త్ర‌ను చేసి, శ‌రీరంపై ఎక్క‌డంటే అక్క‌డ బ్లేడ్‌ల‌తో కోసి అఘాయిత్యానికి పాల్ప‌డేందుకు య‌త్నించార‌ని త‌మ‌కు ఫిర్యాదు అందింద‌ని చెప్పారు. బాధితురాలు హ‌రిణి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.