గుబులు రేపుతున్న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు..!

0
241

క‌ర్ణాట‌క సంకీర్ణ ప్ర‌భుత్వానికి బీట‌లు వారాయి. రాజ‌కీయ వైరుధ్యాల మ‌ధ్య అతుకుల బొంత‌లా కొన‌సాగుతున్న కాంగ్రెస్ – జేఈఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వం రేపో.. ఎల్లుండో కూలిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన మాజీ ప్ర‌ధాన మంత్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క‌లో త్వ‌ర‌లో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన డిమాండ్‌ల‌న్నిటినీ ఆమోదించినా ఆ పార్టీ స‌హ‌కరించ‌డం లేద‌ని దేవెగౌడ విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం ఉన్న సంకీర్ణ ప్ర‌భుత్వం ఇక ఎంత‌కాలం కొన‌సాగుతుందో చెప్ప‌లేనని, త్వ‌ర‌లోనే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.