‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఆంధ్రప్రదేశ్ లో ఆరోజే..!

0
223
Lakshmis NTR
Lakshmis NTR will releasing in Ap

రాంగోపాల్ వర్మ తెరక్కేకించిన వివాదస్పద సినిమా ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా ఒక్క ఆంధ్ర ప్రదేశ్ తప్ప మిగిలిన అన్ని చోట్ల విడుదలైంది. మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టి, నిర్మాతలకు భారీ లాభాలను చేకూర్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే టీడీపీ పార్టీ ‘లక్ష్మీస్ఎన్టీఆర్’ ను అడ్డుకొనుటకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరకు ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకుండా విజయాన్ని సాధించింది. ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యాక విడుదల జరగాలని కోర్టు సపోర్ట్ ఇచ్చింది. చేసేది ఏమి లేక ఆర్జీవీ కూడా ఊరుకున్నాడు. కానీ ఎలక్షన్స్ ముందే చూసే అదృష్టం వాళ్లకే లేదన్నట్లు ఉరుకున్నాడట.

ఇక పోలింగ్ 11వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపీలో విడుదల చేయు దిశగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో ‘ఈ వారం ఆంధ్రప్రదేశ్ లో విడుదల లక్ష్మీస్ఎన్టీఆర్’ అంటూ పోస్ట్ చేశాడు. పోలింగ్ గురువారం ముగియనుండటంతో, శుక్రవారం రోజున భారీగా విడుదల చేయుటకు ప్లాన్ చేశారట. ఇక ఎంతవరకు నిర్మాతలకు లాభాన్ని చేకూర్చుతుందో ఏపీలో చూడాలి.

Rgv tweet on lakshmis ntr movie