‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గెలిచింది.. వర్మ ట్వీట్

0
120
ram gopal varma
lakshmis ntr

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల మీద కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం ఈరోజు తో ముగిసింది. ఆర్జీవీ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికల నియామకాలకు వ్యతిరేకంగా ఉందంటూ ఈసీకి ఫిర్యాదు అందగా, ఈసీ నుంచి నోటీసులను అందుకున్న సినీ నిర్మాత రాకేష్‌ రెడ్డి సోమవారం ఏపీ ఎన్నికల సంఘం ముఖ్యాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిశారు. ఈ నేపథ్యంలో సినిమా అభ్యంతరకర సన్నివేశాల మీద ఈసీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ రాత పూర్వకమైన సమాధానాన్ని ఇచ్చారట.

రాకేష్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29 వ తేదీన తప్పకుండ విడుదలవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మి పార్వతి రాసిన పుస్తకము ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్రంలో పసుపు జెండాలు తప్ప ఎక్కడ పార్టీ గుర్తులు కనిపించలేదని తప్పకుండ సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ అందచేస్తుంది. వారు అడిగిన ప్రతి ప్రశ్నలకు రాత పూర్వకంగా సమాధానం అందించాను. సినిమా కున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని తెలిపారు.

ఈ ఆనందాన్ని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో వ్యక్త పరుస్తూ ‘నిజం గెలిచింది. సెన్సార్ బోర్డు నుంచి వివాదాలు తొలగి పోయాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ యూనివర్శిల్ వ్యూబుల్ సినిమాగా క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్‌ అందిందంటూ’ దీనికి జతగా ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి చెవిలో ఈ ఆనందకరమైన విషయాన్ని చెప్తున్నట్లుండే ఇమేజ్ తో పోస్ట్ చేశారు.

ram gopla varma tweet