కడప సాక్షిగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఆడియో రిలీజ్ గొప్ప బహిరంగ సభ : వర్మ షాక్

0
149
కడప సాక్షిగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఆడియో రిలీజ్ గొప్ప బహిరంగ సభ : వర్మ షాక్
కడప సాక్షిగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఆడియో రిలీజ్ గొప్ప బహిరంగ సభ : వర్మ షాక్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు నడుస్తున్నాయ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విలన్ గా చూపించారని అందువల్ల ఈ సినిమా విడుదల చేయకూడదని TDP నేతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు.. సినిమా ట్రైలర్ లోనే NTR జీవితంలో అసలు విలన్ చంద్రబాబే అని స్పష్టంగా చూపించాడు వర్మ. దాన్నే ఆధారంగా చూపించి ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదలైతే మాకు నష్టం జరిగే అవకాశం ఉంది అని TDP పార్టీ భయం.

లోలోపలా చంద్రబాబుకు కూడా అదే భయం ఉన్నా బయటకిమాత్రం అసలు రామ్ గోపాల్ వర్మ ఎవరో నాకు తెలియదు అనేలా ప్రవర్తిస్తున్నాడు అంటూ బాబుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదిలాఉంటే మరోపక్క వర్మ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన నా సినిమాను ఎవ్వరు ఆపలేరు..అంత దమ్ము, దౌర్యం ఎవ్వరికీ లేదు అను భయిరంగంగానే చెప్పుకొస్తున్నాడు.

అక్కడితో ఆగని వర్మ సోషల్ మీడియా వేదికగా మరో షాక్ ఇచ్చాడు. తన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఎక్కడా ? ఎప్పుడు జరుగుతుంది ? అనేది చెప్పేవిదంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో.. “లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడపలో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది.. ఈవెంట్ పేరు “వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్.. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచెయ్యబడుతుంది.. జై ఎన్టీఆర్ #LakshmiNTR” అంటూ సంచలన పోస్టు పెట్టాడు వర్మ.

ఆడియో రిలీజ్ ఈవెంట్ “కడప”లోనే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చిన వర్మ డేట్ మాత్రం త్వరలో రిలీజ్ చేస్తా అంటూ సస్పెన్స్ పెట్టాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి బగ్గుమంటుంది. ఎక్కడ చూసిన భయిరంగ సభలు, ఒకరిని ఒకరు తిట్టుకోవడాలు, పార్టీ మారడాలే కనిపిస్తున్నాయి. ఇంత రసవత్తరమైన రాజకీయ వేడిలో వర్మ అనుకున్న స్థాయిలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ఆడియో వేడుకలు జరుగుతాయా ? ఇంతకీ ఆ సినిమా రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.