నా పరువు, మర్యాదను కాపాడండి : ఎట్టకేలకు బయటకొచ్చిన లక్ష్మీపార్వతి

0
81
నా పరువు, మర్యాదను కాపాడండి : ఎట్టకేలకు బయటకొచ్చిన లక్ష్మీపార్వతి
నా పరువు, మర్యాదను కాపాడండి : ఎట్టకేలకు బయటకొచ్చిన లక్ష్మీపార్వతి

గత కొన్నిరోజులుగా “లక్ష్మీపార్వతి నన్ను లైగికంగా వేదిస్తుంది” అంటూ కోటి అనే ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చిన సదురు వ్యక్తి.. అదేపనిగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ అమె నుండి నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి అక్కడ “వాట్స్ యప్” మెసేజ్ సాక్ష్యంగా లు కనిపిస్తున్నా అందులో నిజం ఎంత ? అబద్దం ఎంత ? అనేది అందరిలో ఉన్న పెద్ద సందేహం.

ఎందుకంటే ఆమె ఒక సినిమా సెలబ్రేటి కాదు, అలా అని ఆమెకు 30 ఏళ్ల వయసు లేదు.. దాదాపు 68 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆమె. అలాంటి ఆమెపై ఒక సాదారణ వ్యక్తి వచ్చి కంప్లెయింట్ చేస్తే ఎలా నమ్మగళం..? కానీ ఒక రెండు ఛానెల్స్ మాత్రం వార్త దొరకగనే నమ్మేసాయి. వెంటనే సదురు వ్యక్తిని స్టూడియోకి తీసుకొచ్చి లైవ్ షో చేసేశారు. దాంతో ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ క్షణం నుండి ఈ వార్తలో నిజం ఎంత ? అనే విషయం తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం ఎప్పటివరకు సైలెంట్ గానే ఉంది.

అలాంటి ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది.. రావడం రావడంతోనే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసిన ఆమె.. కోటి అనే యువకుడితో పాటు మరికొందరు తనను టార్గెట్ చేసి… తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిజానికి కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానని… అలాంటి అతడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. కాబట్టి తన పరువు, మర్యాదలను కాపాడాలని మహేందర్ రెడ్డిని కోరారు లక్ష్మీపార్వతి.