టీడీపీ అంటే ఇప్ప‌టికీ ఇష్ట‌మే : ల‌క్ష్మీపార్వ‌తి

0
256

దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు సతీమ‌ణిగా తాను తెలుగుదేశం పార్టీని గౌర‌విస్తాన‌ని ల‌క్ష్మీపార్వ‌తి అన్నారు. ఈ రోజు ఆమె ప్ర‌ముఖ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా టీడీపీకి చెందిన న‌లుగురు ఎంపీలు బీజేపీలో చేర‌డాన్ని ఆమె ఖండించారు. ఆ విష‌యం త‌న‌ను చాలా బాధించింద‌న్నారు.

త‌న జీవిత కాలంలో ఇప్ప‌టి వ‌రకు టీడీపీ నాశ‌నం అవ్వాల‌ని తాను కోరుకోలేద‌ని, ఒక్క చంద్ర‌బాబు మాత్ర‌మే టీడీపీ నుంచి తొల‌గాల‌ని తాను కోరుకున్న విష‌యాన్ని మీడియా వేదిక‌గా ల‌క్ష్మీ పార్వ‌తి చెప్పారు. చంద్ర‌బాబు రాజ‌కీయంగా పూర్తిగా తొల‌గిన‌ప్పుడే తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ పురుడుపోసుకుంటుందన్నారు.