బిగ్ బ్రేకింగ్ : ల‌గ‌డ‌పాటి అస‌లు సిస‌లైన రాయ‌ల సీమ రిపోర్ట్ వ‌చ్చేసింది..!

0
795

గ‌త ఐదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో దూసుకెళ్లిన తెలుగుదేశం ప్ర‌భుత్వం ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా, రాయ‌ల‌సీమ‌లోని 52 అసెంబ్లీ సీట్ల‌లో అత్య‌ధిక సీట్ల‌ను కైవ‌సం చేసుకోనుంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం గ‌త ఐదేళ్ల పాల‌న‌లో సీఎం చంద్ర‌బాబు సీమ గ‌డ‌ప‌కు నీళ్లు తీసుకురావ‌డం, అలాగే క‌డ‌ప‌లో స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు, చిత్తూరుకు ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీల‌ను తీసుకురావ‌డం, ఇక కర్నూలు విష‌యానికొస్తే ఎయిర్‌పోర్టు నిర్మాణంతోప‌టు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే సౌర విద్యుత్ పార్కు ఏర్పాటు ముచ్చుమ‌ర్రి ఎత్తిపోత‌ల ప్రాజెక్టు నిర్మాణం, అనంత‌పురం జిల్లాలో యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేలా కియా మోటార్స్ ఏర్పాటు ఇలా రాయ‌ల‌సీమలోని నాలుగు జిల్లాల‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్ర‌బాబు కృషి చేశార‌ని, ఎప్పుడూ అభివృద్ధికి ప‌ట్టం క‌ట్టే ఆ ప్రాంత ప్ర‌జ‌లు ఈ సారి ఏక‌ప‌క్షంగా టీడీపీ వైపు మొగ్గు చూపడం ఖాయ‌మ‌ని, రాయ‌ల‌సీమ‌లో అత్య‌ధిక మెజార్టీ సీట్ల‌ను కొల్లగొట్ట‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అస‌లు సిస‌లైన స‌ర్వే రిపోర్టు ఇదేనంటూ ఓ సర్వే నివేదిక సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ స‌ర్వే నివేదిక ప్ర‌కారం 2014 – 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య తేడాల‌ను స్ప‌ష్టంగా పేర్కొంటూ ఓ నివేదిక చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ నివేదిక ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అయితే, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ – 103, వైసీపీ – 67, బీజేపీ – 4, స్వ‌తంత్రులు – 1 అసెంబ్లీ సీటును గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. అందులో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాయ‌ల‌సీమ‌లో టీడీపీ 22, వైసీపీ 30 స్థానాల‌ను గెలుపొందాయి. అయితే, ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ సీన్ రివ‌ర్స్ కానుంద‌ని ల‌గ‌డ‌పాటి స‌ర్వే పేర్కొన‌డంతోపాటు, అందుకు ప‌లు కార‌ణాల‌ను ఆ స‌ర్వే నివేదిక వెల్ల‌డిస్తోంది.

క‌ర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో..
2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 3, వైసీపీ 11 గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. అయితే కేవీ, కోట్ల కుటుంబాలు, గౌరు వెంక‌ట‌రెడ్డి కుటుంబం, బైరెడ్డి కుటుంబం ఇలా ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కుటుంబాలు ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో గ‌త సార్వ‌త్రిక ఎన్నికల ఫ‌లితాలు రివ‌ర్స్ కానున్నాయ‌ని, ఈ నెల 23న వెలువడ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ 9, వైసీపీ 5 స్థానాల‌ను గెలుపొంద‌డం ఖాయ‌మంటూ ఆ స‌ర్వే పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

క‌డప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో..
2014 ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 1, వైసీపీ 9 గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆది నారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి వారి వారి రాజ‌కీయ వైరాలను వీడి టీడీపీకి తీవ్ర కృషి చేశార‌ని, దీంతో క‌డ‌ప‌లో టీడీపీ బ‌లం మ‌రింత పుంజుకుందని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో గ‌త సార్వ‌త్రిక ఎన్నికల ఫ‌లితాలు రివ‌ర్స్ కానున్నాయ‌ని, ఈ నెల 23న వెలువడ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ 5, వైసీపీ 5 స్థానాల‌ను గెలుపొంద‌డం ఖాయ‌మంటూ ఆ స‌ర్వే వెల్ల‌డించింది.

చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో..
2014 ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 6, వైసీపీ 8 గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. అయితే నారా, న‌ల్లారి కుటుంబాల క‌ల‌యిక‌, అమ‌ర్‌నాథ్‌రెడ్డి స‌హ‌కారం, సీకే బాబు టీడీపీ తీర్ధం పుచ్చుకోవ‌డం, చెంగారెడ్డి కృషి క‌లిపి చిత్తూరు జిల్లాలో టీడీపీ మ‌రింత బ‌ల‌ప‌డిందని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ నెల 23న వెలువడ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ 9, వైసీపీ 5 స్థానాల‌ను గెలుపొంద‌డం ఖాయ‌మంటూ ఆ స‌ర్వే పేర్కొంది.

అనంత‌పురం చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో..
2014 ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 12, వైసీపీ 2 గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు గ‌త ఐదేళ్ల పాల‌న‌లో ఈ జిల్లా తాగునీటి క‌ష్టాలు తీర్చేందుకు కృష్ణా జిల్లాలు తీసుకొచ్చాడ‌ని, అలాగే ఉపాధి క‌ల్ప‌న నిమిత్తం కియా మోటార్స్ వంటి అంత‌ర్జాతీయ కంపెనీల‌ను ఏర్పాటు చేశార‌ని, దాంతో గ‌తంకంటే టీడీపీ మ‌రింత పుంజుకుంటుందని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ నెల 23న వెలువడ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ 13, వైసీపీ 1 స్థానాల‌ను గెలుపొంద‌డం ఖాయ‌మంటూ ఆ స‌ర్వే పేర్కొంది.

ఇలా మొత్తంగా ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రాయ‌ల‌సీమ‌లోని 52 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ 35, వైసీపీ 17 అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొంద‌నుందంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ల‌గ‌డ‌పాటి స‌ర్వే పేర్కొన‌డం గ‌మ‌నార్హం.