ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ : మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు..!

0
430

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలోకంటే కూడా ఈ సారి పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ర‌ద్దీ ఎక్కువ‌గా క‌నిపించింద‌ని, దాంతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైంద‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెప్పారు. అక్క‌డ‌క్క‌డ కొన్ని ఈవీఎం మిష‌న్‌లు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌న్న దృఢ సంక‌ల్ప‌తో ఉన్న ప్ర‌జ‌లు తెల్ల‌వారుజామున వ‌రుక కూడా పోలింగ్‌లో పాల్గొన్నార‌న్నారు.

ఎక్క‌కువ శాతం పోలింగ్ న‌మోదు అయ్యేందుకు ప్ర‌ధాన కార‌ణంగా ప్ర‌జ‌ల్లో వచ్చిన చైత‌న్యం కావొచ్చు.. ఎన్నిక‌ల సంఘం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు కూడా కార‌ణం కావొచ్చ‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. త్రిముఖ పోటీ కార‌ణంగానే ఎక్కువ శాంతి ప్ర‌జ‌లు ఓటింగ్‌లో పాల్గొన్నార‌న్నారు. ఓటు హ‌క్కును వినియోగించుకున్న వారిలో యువ‌త ఎక్కువ శాతం ఉన్నార‌ని తెలిపారు. మే 19వ తేదీ సాయంత్రం వ‌ర‌కు ఎటువంటి ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డించ కూడ‌ద‌ని, త‌న స‌ర్వే మే 19 సాయంత్రం 3 గంట‌ల త‌రువాత విడుద‌ల అవుతుంద‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్నారు.