ల‌గ‌డ‌పాటి స‌ర్వేలు ఎవరికోసమంటే..?

0
70

కొందరి ప్రయోజనాల కోసమే లగడపాటి తప్పుడు సర్వేలు చేస్తుంటారని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. లగడపాటి సర్వే వివరాల్ని కొట్టిపారేసిన  సజ్జల, ఆంధ్రా ఆక్టోపస్‌గా ఆయనను ఆయనే చిత్రీకరించుకున్నారని ఎద్దేవా చేశారు. సర్వే విడుదలకు ముందు టీడీపీ నేతలతో చర్చించి వారికి అనుకూలంగా ఫలితాలను ఇస్తారని సజ్జల ఆరోపించారు.

కేసులు, అక్రమాల నుంచి తప్పించుకోవడాకే చంద్రబాబు నాయుడు జాతీయ నేతల చుట్టూ తిరుగుతున్నారని సజ్జల అన్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలినుంచి  ప్రజల పక్షాన చేస్తున్న పోరాటానికి ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని.. ఎగ్జిట్‌ పోల్స్‌లో వచ్చిన ఫలితాలకంటే, మే 23న మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని  ఆయన ధీమా వ్యక్తం చేశారు.