ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఎగ్జిట్‌పోల్స్ : ఏపీ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టేది ఆ పార్టీకే..!

0
78

మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కాసేప‌టి క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌లు – 2019కు, తెలంగాణ పార్ల‌మెంట్ ఎన్నిక‌లు – 2019 సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ను తిరుప‌తి వేదిక‌గా విడుద‌ల చేశారు. ముందుగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ఎంతో పోటా పోటీగా జ‌రిగాయ‌ని, ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీ నెల‌కొంద‌న్నారు. ఏదేమైనా ఆర్జీ ప్లాష్ టీమ్ తెలంగాణ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించి చేసిన స‌ర్వే వివ‌రాలు ఇలా ఉన్నాయంటూ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వివ‌రించారు.

తెలంగాణ‌లోని మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల్లో..
టీఆర్ఎస్ : 14 నుంచి 16 స్థానాలు
కాంగ్రెస్ : 1 – 2 స్థానాలు
బీఏపీ : 0 – 1 స్థానాలు ( ఏమీ రాక‌పోవ‌చ్చు)
ఎంఐఎం : 1

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌లు – 2019కు సంబంధించి ఆర్‌జే ప్లాష్ టీమ్ చేసిన స‌ర్వే వివ‌రాలు ఇలా ఉన్నాయంటూ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వివ‌రించారు. వివ‌రించారు.

ఆంధ్రప్ర‌దేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో..
టీడీపీ : 90 – 110
వైసీపీ : 70 – 80
ఇత‌రులు : 2 – 3

ఏపీలోని మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాల్లో..
టీడీపీ : 13 – 17
వైసీపీ : 8 – 10
ఇత‌రుల‌కు : 0 – 1

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి టీడీపీకే ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్టార‌న్న వివ‌రాలను ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స్ప‌ష్టం చేశారు.