క‌ర్నూలు జిల్లా గ్రౌండ్ రిపోర్ట్ : క్లీన్ స్వీప్ దిశ‌గా వైసీపీ.. విశ్లేష‌ణ‌లో వెల్ల‌డి..!

0
350

ఆంధ్రప్ర‌దేశ్ రాజకీయాల్లో క‌ర్నూలు జిల్లాది ప్ర‌త్యేక‌శైలి. స‌ర్పంచ్‌ల నుంచి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ప‌ద‌వులు అనుభ‌వించిన వారు ఈ జిల్లాలోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఏప్రిల్ 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ఈ జిల్లాలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధులుగా హోరా.. హోరీగా త‌ల‌ప‌డ్డాయి. కాగా, గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 11 స్థానాల్లోను, టీడీపీ కేవ‌లం 3 స్థానాల్లో పాగా వేసిన సంగ‌తి తెలిసిందే.

కానీ, ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అవుతుంద‌ని, టీడీపీ త‌క్కువ‌లో త‌క్కువ‌గా 9 అసెంబ్లీ స్థానాలను కైవ‌సం చేసుకుంటుంద‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మ‌రోప‌క్క వైసీపీ శ్రేణులు సైతం గ‌తంలో మూడు సీట్ల‌ను కోల్పోయామ‌ని, మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాల్లో ఆ మూడు క‌లిపి మొత్తం 14/14 సీట్ల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.