ప్లాష్‌.. ప్లాష్ : కృష్ణా జిల్లా స‌ర్వే రిజ‌ల్ట్ అవుట్‌..! ఏఏ పార్టీకి ఎన్నెన్ని..?

0
562

మే 23న వెలువ‌డ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉండ‌నున్నాయి..? ఏపీలో అధికారం ఎవ‌రి సొంతం కానుంది..? ముఖ్య‌మంత్రి ఎవ‌రు..? చంద్ర‌బాబే మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డ‌తారా..? వైఎస్ జ‌గన్‌కే ప‌ట్టం క‌డ‌తారా..? అన్న ప్ర‌శ్నలపై రాజ‌కీయ విశ్లేష‌కుల మ‌ధ్య విస్తృత చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి.

ఇలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం త‌మ‌దే అధికార‌మని చెబుతున్నారు. మ‌రోప‌క్క వైసీపీ శ్రేణులు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌లు న‌మ్మ‌కం పెంచుకున్నార‌ని, ఏప్రిల్ 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని, అధికారం త‌మ‌దేన‌న్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో మీడియా ముందుకొచ్చిన జ‌న‌సేన ముఖ్య నేత‌లు త‌మ‌కు 80 సీట్లు ప‌క్కా అని చెప్ప‌గా, తెలుగుదేశం శ్రేణులు 150, వైసీపీ నేత‌లు 120 ప‌క్కా అంటూ అసెంబ్లీ స్థానాల లెక్క‌ల జాబితాను మీడియా ముందు ఉంచారు. ఇంత‌కీ వారు చెప్పిన లెక్క‌లు వాస్త‌వ‌మేనా..? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలియాలంటే ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు మ‌రీ.

అయితే, ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓ స‌ర్వే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రాజకీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఈ స‌ర్వే ఏపీలోని అన్ని జిల్లాల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది.

కాగా, కృష్ణా జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 16, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ 11, తెలుగుదేశం 4 స్థానాల్లో గెలుపొందుతుంద‌ని ఆ స‌ర్వే వెల్ల‌డించింది. అదే విధంగా గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ప‌ది స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.