బిగ్ బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
924

నెల్లూరు రూర‌ల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా, ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొద‌ట‌గా త‌న‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌క‌పోవ‌డంపై స్పందించిన ఆయ‌న త‌న‌కు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కినా, ద‌క్క‌క‌పోయినా త‌మ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉంటే చాల‌న్నారు.

అయితే మంత్రుల‌ము.. మంత్రుల‌ము కాకుంటే ఎవ‌రికి వారు ముఖ్య‌మంత్రులంటూ కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జ‌గ‌న్ గుండెల్లో తాము ఉన్నామ‌ని, త‌మ గుండెల్లో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఉన్నార‌న్నారు. పార్టీలోని ఎవ్వ‌రితోను చ‌ర్చించ‌కుండానే మంత్రుల‌ను ఎంపిక చేసే అవ‌కాశం ఉన్నా కూడా సీఎం జ‌గ‌న్ ఎమ్మెల్యేలంద‌రితో చ‌ర్చించిన త‌రువాత మంత్రుల ఎంపిక చేయ‌డ‌మ‌న్న‌ది దేశంలో తొలిసారి అన్నారు. ఆ విష‌యంలో జ‌గ‌న్ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను గెలుచుకున్నార‌న్నారు.

వైసీపీ స్థాప‌న నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ త‌దిత‌ర సామాజిక‌వ‌ర్గాల వారికి 50 శాతం ప్రాధాన్య‌త క‌ల్పిస్తాన‌న్న జ‌గ‌న్ చెప్పిన విధంగానే, మంత్రివ‌ర్గ కూర్పులోను జ‌గ‌న్ పాటించార‌ని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు.