రాహుల్‌కు బిగ్‌షాక్‌ ఇవ్వ‌బోతోన్న‌ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్.!

0
164

అటు, కేంద్రంలోగాని, రాష్ట్రంలోగాని కాంగ్రెస్ పార్టీకి క‌నుచూపుమేర‌లో అధికారం క‌నిపించక‌పోవ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప‌క్క‌చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు టీఆర్ఎస్ గూటికి చేరుకోగా, అక్కడ ఇమ‌డ‌లేమ‌నుకున్న‌వారు మ‌రికొంద‌రు బీజేపీ వైపు చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ బంప‌ర్ మెజార్టీతో అధికారం చేప‌ట్ట‌డంతో బీజేపీనే బెట‌ర‌ని లెక్క‌లు క‌ట్టుకుంటున్నారు.

దీనికితోడు బీజేపీ తెలంగాణ‌లో పార్టీని బిల్ట్ చేయ‌డానికి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కి తెర‌లేపింది. ఇప్పుడు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఎంపీగా గెలుపొంద‌గా, అత‌ని సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్యెల్యేగా కాంగ్రెస్ త‌ర‌పున విజ‌యం సాధించారు.