ఒక్క‌టి కాబోతున్న కోలీవుడ్ ప్రేమ జంట‌..?

0
220

శాయేషా సైగ‌ల్, దిలీప్ కుమార్ సైరా భాను మ‌నుమ‌రాలైన శాయేషా మూడేళ్ల క్రితం అఖిల్ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత హిందీలో శివాయ్ సినిమాలో అజయ్ దేవ‌గ‌న్ తో జ‌త‌క‌ట్టింది. హిందీలో, తెలుగులో ఆఫ‌ర్స్ రాకున్నా త‌మిళ సినిమాల‌తో శాయేషా బిజీ అయిపోయింది.

అయితే, త‌మిళంలో గ‌జ‌నీకాంత్ సినిమాలో న‌టిస్తున్న స‌మ‌యంలో హీరో ఆర్య‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం వీరి మ‌ధ్య ప్రేమ‌కు దారి తీసింది. ఇద్ద‌రూ క‌లిసి క్లోజ్‌గా ఉండ‌టంతో ప్రేమ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చినా ఎవ‌రూ ఖండించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ ల‌వ్ బ‌ర్డ్స్ కాప్పాన్‌ సినిమా చేస్తున్నారు. వీరిద్ద‌రూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారన్న స‌మాచారం కోలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అలాగే, 18 ఏళ్ల‌కే హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన శాయేషా త‌న‌కంటే 18 ఏళ్లు పెద్ద‌వాడైన ఆర్య ప్రేమ‌లో విహ‌రిస్తోంది. ఈ ఏడాది పెళ్లిపీటలెక్కి ఓ ఇంటిద‌వుతుంద‌న్న న్యూస్ కోలీవు్ వ‌ర్గా్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కెరీర్‌లో ఇప్పుడిప్పుడే ఎదురుగుతున్న టైమ్‌లో 21 ఏళ్ల‌కే శాయేషా పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి మ‌రి.