కోడి రామకృష్ణ తల బ్యాండ్‌ వెనకున్న చరిత్ర, సెంటిమెంట్ ఇదే : అందుకే

0
180
కోడి రామకృష్ణ తల బ్యాండ్‌ వెనకున్న చరిత్ర, సెంటిమెంట్ ఇదే : అందుకే
కోడి రామకృష్ణ తల బ్యాండ్‌ వెనకున్న చరిత్ర, సెంటిమెంట్ ఇదే : అందుకే

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి తెలుగు రాష్ట్రాలను కన్నీళ్లు పెట్టించిందనే చెప్పాలి. అందులోనూ మహిళలకు కోడిరామకృష్ణ గారి సినిమాలు అంటే మహా పిచ్చి.. అలాంటి ఆయన మరణించాడు అని తెలియడంతో ప్రతి తెలుగు మహిళా కంటతడి పెడుతుంది. ఇలాంటి టైమ్ లో రామకృష్ణ గారిని, ఆయన దర్శకత్వాన్ని మరీ ముఖ్యంగా వెళ్లకు ఉంగరాలు, తాళ్ళు, తలకు రుమాలుతో స్టైలిష్ గా ఉండే ఆయన లుక్ ని ఇష్టపడే చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతడి ప్రత్యేకతల గురించి చేర్చించుకుంటున్నారు.

కోడి రామకృష్ణ గారి లుక్ గురించి చాలమందికి తెలుసు.. వెళ్లకు ఉంగరాలు, తాళ్ళు.. తలకి కండువ బయట ఆయన ఎక్కడ కనిపించిన ప్రతి ఒక్కరు ఆయన కోడి రామకృష్ణ గారు అని టక్కున చెప్పేస్తారు. దూరంనుండి ఆయన మొహం సరిగ్గా కనిపించకపోయిన ఆయన లుక్ చూసే గుర్తుపడతారు చాలామంది. అలాంటి కోడి రామకృష్ణ ప్రముఖ చానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తన “తల కండువ” వెనక ఉన్న సెంటిమెంట్ ఏంటో బయటపెట్టడు.

చిరంజీవి గారితో చేసిన మొదటి సినిమా “ఇంట్లో రామయ్య వీదిలో కృష్ణయ్య” తరువాత తన రెండో సినిమా “మాపల్లెలో గోపాలుడు” అనే సినిమాతో యాక్షన్ కింగ్ అర్జున్‌ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు కోడి రామకృష్ణ. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్‌ గా పని చేసిన “మోకా రామారావు” అనే వ్యక్తి రామకృష్ణ గారి దగ్గరకు వచ్చి.. “మీ నుదిటి భాగం చాలా పెద్దది.. అసలే ఇది వేసవి కాలం.. ఎండలో ఇలా మాడిపోకూడదు” అని తన జేబులోని రుమాలుని తీసి రామకృష్ణ గారి తలకి కట్టాడు.. దాంతో ఆరోజు మొత్తం తలకు రుమాలు కట్టుకొనే షూటింగ్ చేశారట రామకృష్ణ గారు.

ఆ లుక్ లో ఆయన బాగా కనిపించడంతో మరుసటిరోజు “మోకా రామారావు” గారు రామకృష్ణ గారికోసం ఒక కొత్త బ్యాండ్ తయారు చేయించి.. “నిన్న మీరు కట్టుకున్న జేబు రుమాలు మీకు బాగా నప్పింది.. చాలా మంది తలకు జేబు రుమాలు కట్టుకుంటారు.. కానీ మీకు నప్పినంతగా ఎవరికీ నప్పలేదు.. ఇది ఈ జన్మది కాదు క్రితం జన్మలో కూడా మీరు ఇలానే ఉండుంటారు.. అందుకే అంత బాగా సరిపోయింది ఇదే మీకు స్ఫూర్తి.. అందుకే మీకోసం స్పెషల్ గా ఒక రుమాలు చేయించను.. ఇకనుండి దీన్ని రోజు కట్టుకోండి చాలా బాగుంటుంది” అని ఆ రుమాలు రామకృష్ణ గారికి ఇచ్చారు “రామారావు” గారు. అలా ఆరోజునుండి ఆ బ్యాండ్‌ను సెంటిమెంట్‌ గా తలకు పెట్టుకునేవారు రామకృష్ణ గారు.