స్పీక‌ర్ కోడెలపై కుట్ర ప‌న్నింది ఆ ముగ్గురేనా..?

0
265

స‌త్తెన‌ప‌ల్లి ఇనిమెట్ల‌లో 106వ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి అంబ‌టి రాంబాబు, బాసు లింగారెడ్డి, రాజ నారాయ‌ణ ముగ్గురు క‌లిసి త‌న‌పై దాడి చేసేందుకు కుట్ర ప‌న్నార‌ని ఆయన ఆరోపించారు.

క‌నీస భ‌ద్ర‌త లేకుండా పోలింగ్ నిర్వ‌హించిన అధికారుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కోరారు. ఏపీలో ఎన్నికలు స‌జావ‌గా జ‌రిగేందుకు కావాల్సిన బ‌ల‌గాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పంపించ‌లేద‌ని, ఈవీఎంలు కూడా స‌రిగ్గా ప‌నిచేయ‌లేద‌ని కోడెల శివప్ర‌సాద‌రావు ఆరోపించారు.