కే ట్యాక్స్‌పై వివ‌ర‌ణ ఇచ్చిన మాజీ స్పీక‌ర్ కోడెల‌..!

0
158

త‌న కుటుంబంపై వ‌స్తున్న కే ట్యాక్స్ వ‌సూలు ఆరోప‌ణ‌లపై ఏపీ మాజీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ వివ‌ర‌ణ ఇచ్చారు. కాగా, ఈ రోజు మీడియా ముందుకొచ్చిన ఆయ‌న మాట్లాడుతూ త‌మ కుటుంబంపై ఆరోప‌ణ‌లు స‌మంజ‌సం కాద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌లపై జ‌రుగుతున్న దాడుల‌ను తాను ఖండిస్తున్నాన‌ని, టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అభివృద్ధిపై దృష్టిపెట్టామే త‌ప్ప దాడుల‌పై కాద‌ని ఆయ‌న అన్నారు.

తాను ఏపీ స్పీక‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాన‌ని శివ ప్ర‌సాద్ తెలిపారు. నాడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీని బ‌హిష్క‌రించిన స‌మ‌యంలో కూడా స‌మావేశాలకు రావాల్సిందిగా ఆహ్వానించాన‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం టీడీపీ కార్య‌క‌ర్త‌లు గ్రామాల‌ను వీడి వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని, అంతేకాకుండా జ‌రుగుతున్న దాడుల‌కు సంబంధించి పోలీసులు సైతం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని ప‌రిస్థులు నెల‌కొన్నాయ‌న్నారు.

త‌న కుటుంబంపై కావాల‌నే కొంద‌రు రాజ‌కీయ నేత‌లు కేసులు పెడుతున్నార‌ని కోడెల శివ ప్ర‌సాద్ ఆరోపించారు. త‌మ‌పై కేసులు పెట్టాల‌ని వైసీపీ రాజ్య‌స‌భ సభ్యుడు విజ‌య‌సాయిరెడ్డి రెచ్చ‌గొడుతున్నార‌ని, సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌సాయిరెడ్డి పోస్టు చేస్తున్న ట్వీట్లు అక్ర‌మ కేసుల‌ను ప్రోత్స‌హించేలా ఉన్నాయ‌ని కోడెల శివ ప్ర‌సాద్ త‌న అభిప్రాయాన్ని తెలిపారు.