కొడాలి నాని సంచ‌ల‌న నిర్ణ‌యం.. శాస‌న‌ స‌భాప‌క్ష స‌మావేశంలో..!

0
683

గుడివాడ వైసీపీ టికెట్‌పై మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నాని తాజాగా మీడియాతో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోలో కొడాలి నాని మాట్లాడుతూ వైసీపీపై, వైఎస్ జ‌గ‌న్‌పై త‌న‌కున్న అభిమానాన్ని మ‌రోమారు చాటుకున్నారు.

ఇంత‌కీ కొడాలి నాని ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే..? తాను బ‌తికున్నంత కాలం గుడివాడ‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుంద‌ని, అదే త‌న ల‌క్ష్య‌మ‌ని కొడాలి నాని తెలిపారు. త‌న ల‌క్ష్యానికి చంద్ర‌బాబే కాదు.., ఆయ‌న చంద్ర‌బాబు బాబే అడ్డొచ్చినా ఆప‌లేని ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు. అటువంటి వారికి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని కొడాలి నాని అన్నారు.

అయితే, ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొడాలి నాని త‌న స‌మీప ప్ర‌త్య‌ర్ధి దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. మొత్తంగా కొడాలి నానికి 89,833 ఓట్లు ప‌డ‌గా, దేవినేని అవినాష్‌ – 70,354 ఓట్ల‌ను ద‌క్కించుకున్నారు.