కొడాలి నానికి గెలుపా..? ఓట‌మా..? ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అద్భుత విశ్లేష‌ణ‌..!

0
117

ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ దినప‌త్రిక‌కు చెందిన ఎడిట‌ర్ ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ప‌డే క్రిస్టియ‌న్ ఓట్లను చీల్చేందుకు ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షులు కే.ఏ.పాల్‌ను సీఎం చంద్ర‌బాబు రెచ్చ‌గొట్టార‌ని, క్రిస్టియ‌న్ ఓట్ల‌కు సంబంధించి ఒక‌టి లేదా రెండు శాతం వైసీపీ న‌ష్ట‌పోతుందన్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు కే.ఏ.పాల్‌ను రంగంలోకి దించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

చంద్ర‌బాబు ఒక్క కే.ఏ.పాల్‌తోనే కాకుండా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కూడా క‌లిశార‌ని, వైసీపీకి కాపు ఓట్లు ప‌డ‌కుండా అడ్డుకునేందుకు చంద్ర‌బాబు ప‌న్నిన కుట్ర‌లో అదొక భాగ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే కే.ఏ.పాల్ పార్టీపై, జన‌సేన అభ్య‌ర్ధుల‌పై టీడీపీ నేత‌ల‌, అభ్యర్ధులు ఒక్క‌టంటే.. ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. అనంత‌రం గుడివాడ రాకీయాల్లో ఎవ‌రు గెలుస్తార‌న్న ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధాన‌మిస్తూ, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కొడాలి నానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పూర్తి స్థాయిలో ఉందని, దాంతో అత్య‌ధిక మెజార్టీతో కొడాలి నాని గెల‌వ‌డ ఖాయ‌మ‌ని చెప్పారు.