మంత్రి కొడాలి : దాన్ని భిక్ష‌గా భావిస్తున్నా..!

0
298

తాను నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొంద‌డాన్ని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల భిక్ష‌గా తాను భావిస్తున్న‌ట్టు ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మంత్రివ‌ర్గ కూర్పులో భాగంగా సాయంత్రం 6 గంట‌ల‌కు ఫోన్‌చేసి రెడీ ఉండ‌మంటేనే మంత్రుల‌మ‌య్యామ‌ని, గుడివాడ ప్ర‌జ‌లు ఓట్లేస్తేనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందాన‌ని ఇలా రెండింటిలోనూ త‌న ప్ర‌మేయం లేద‌ని కొడాలి నాని చెప్పారు.

తాను మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డ‌మంటే అది సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ద‌య‌గా భావిస్తున్నాన‌ని, గుడివాడ ప్ర‌జ‌లు త‌న‌మీద‌పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ప‌నిచేస్తాన‌ని కొడాలి నాని అన్నారు. తినేందుకు ప‌నికొచ్చే బియ్యాన్ని మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సీఎం జ‌గ‌న్ చెప్పార‌ని, ఆ మేర‌కు అధికారుల‌కు తాను ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిపారు.