118 స్పీడ్ లో దూసుకెళ్తున్న… కళ్యాణ్ రామ్..! (మూవీ రివ్యూ )

0
231
kalyanram 118 movie
kalyanram 118 movie review

నటీనటులు: కళ్యాణ్ రామ్ ,నివేదాథామస్, షాలిని పాండే, నాజర్,  ప్రభాస్ శ్రీను

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో  కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా  ‘118’. రొమాంటిక్ , థ్రిల్లర్  సినిమాగా సాగే   సినిమాను  ఎస్ మహేష్ కోనేరు నిర్మించారు.‘118’ సినిమాలో హీరో నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్ర‌ పోషించగా , హీరోయిన్ లుగా నివేదాథామస్, అర్జున్‌రెడ్డి ఫేమ్ షాలినీ పాండేలు నటించారు.  విభిన్నమైన కథతో సాగే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండగా, ఈరోజు  భారీ అంచనాలతో వెండితెరకెక్కింది.

కథలోకి వెళ్తే ..

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించాడు. సింపుల్ గా, స్టైల్ గా ఎంట్రీ  ఇస్తాడు. కథానాయకులుగా  షాలిని పాండే, నివేద థామస్ నటించారు.  కళ్యాణ్ రామ్ కలలో కనిపించిన ఒక అమ్మాయి కోసం వెతుకుతూ 118 కథ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కలలో కనిపించిన అమ్మాయి నిజజీవితంలో  ఉందా?లేదా? అంటూ సినిమా మొత్తం నడుస్తుంది. ఇక 118 విషయానికొస్తే  అర్ధరాత్రి  ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకు  ఆ కల వస్తుంది.  ఆ కలలో అమ్మాయి నివేద థామస్ కథానాయకుడైన కళ్యాణ్ రామ్ ని వెంబడిస్తుంటుంది. నివేద థామస్  ఈ సినిమాలో కనిపించేది కేవలం అర్ధగంట మాత్రమే, కానీ సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. మరో పక్క చూస్తే షాలిని పాండే తో ప్రేమలో పడి , మంచి రొమాన్స్ ని పండించాడు. ఆ అమ్మాయిని వెతికే దిశలో షాలిని పాండే కూడా చాలా సహాయం చేస్తుంటుంది. రొమాన్స్, థ్రిల్లర్, యాక్షన్  సినిమాగా సాగే ఈ కథ లో అమ్మాయి దొరుకుతుందా? దొరికినా హీరో జీవితంలో ఆమె పాత్ర ఏంటి? అనే సస్పెన్స్ ని  తెరపై చూడాల్సిందే.

నటుల యాక్టింగ్ :

కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో తనదైన శైలి లో చాలా  బాగా నటించారు. ఈ పాత్రలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించారని చెప్పవచ్చు.  అమ్మాయి కోసం వెతికే ప్ర‌య‌త్నంలో టెన్షన్ పడుతూనే, మనల్ని టెన్ష‌న్ పెట్టేలా  కథలోకి తీసుకెళ్లేలా నటించాడు. చివరగా ఫైట్స్ కూడా ఎప్పటిలాగే అదరగొట్టాడు.  తన కెరీర్ కి ఇది త‌ప్ప‌కుండా మలుపు  అవుతుంది.  మరోపక్క లవ్ సీన్ లోను అద్భుతంగా నటించాడు. షాలిని పాండే ఈ సినిమాలో కూడా మంచి న‌టి అని మళ్లీ నిరూపించుకుంది.  మోడ్ర‌న్‌గా, స్టైలిష్ లుక్ లో ప్రేక్షకులను అలరించింది..  తన పాత్రకు సరైన విధంగా  న్యాయం చేసిందని  చెప్పవచ్చు. ఇక నివేద థామస్ విషయానికొస్తే  చాలా సింపుల్ గా ఒక ప్రత్యేక పాత్రలో  నటించి అంద‌ర్నీ మెప్పించిందని చెప్పవచ్చు.

టెక్నికల్ పరంగా :

దర్శకత్వం విషయానికొస్తే సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్ష‌కులు కొత్త అనుభూతిని పొందేలా థ్రిల్ ఉండేలా చూశారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. పాటలు యూత్ ని ఆకర్షించాయి. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, గుహన్ ఛాయాచిత్రం అద్భుతమని చెప్పొచ్చు. పరిగెత్తే కథనంతో సాగే ఈ సినిమా థ్రిల్లర్ అదిరిపోయిందంటూ వీక్ష‌కులు అంటున్నారు.

చివరగా  సినిమా 118 తో ముడిపడి  ప్రేక్షకులను మెప్పించేలా, థియేటర్లోనే కుర్చోపెట్టేలా  చేసిందని చెప్పవచ్చు. హీరోకి, హీరోయిన్ లకు త‌ప్ప‌కుండా వారి కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అవుతుంది. కొన్ని కొన్ని స‌న్నివేశాలు బోర్‌కొట్టేలా ఉన్నా.. టెక్నీషియ‌న్ష్ ప‌నిత‌నంతో అవి స‌గ‌టు ప్రేక్ష‌కుడికి క‌నిపించ‌వ‌నే చెప్పాలి.

నటీనటులు: కళ్యాణ్రామ్,నివేదాథామస్, షాలిని పాండే
దర్శకుడు, సినిమాటోగ్రఫీ, కథ: కేవీ గుహన్
నిర్మాత: ఎస్ మహేష్ కోనేరు
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: తమ్మిరాజ్

Rating: 3/5.