కిడ్నీ కొనుగోలు పేరుతో ఘ‌రానా మోసం..!

0
88

కిడ్నీలు కొంటాం.. రూ.3 కోట్లు ఇస్తాం అంటూ జ‌నాన్ని నిండా ముంచారు. పేషేంట్‌ల‌ను, కిడ్నీలు దానం చేసేందుకు సిద్ధ‌ప‌డ్డ వారిని మోసం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఈ కిడ్నీల కొనుగోలు వ్య‌వ‌హారం బుధ‌వారం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఒక్కో కిడ్నీని రూ.3 కోట్ల‌కు కొనుగోలు చేస్తామ‌న్న ఫేస్‌బుక్ యాప్ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. చెన్నై ఈ రోడ్ క‌ళ్యాణికి రిజిస్ట్రేష‌న్ పేరిట భారీగా డ‌బ్బులు వ‌సూలు చేసి ప‌రార‌య్యారు.

ఫేస్‌బుక్‌లో ప్ర‌క‌ట‌న‌లు చూసిన ప‌లువురు ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన వారు దాదాపు 500 మంది వారి వారి కిడ్నీల‌ను అమ్మేందుకు వ‌చ్చారు. అంతేకాకుండా వారి వారి కిడ్నీల‌ను అమ్ముకునేందుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వ‌ర‌కు డిపాజిట్‌లు కూడా చేశారు. అలా కిడ్నీల అమ్మేందుకు వ‌చ్చిన వారి నుంచి డిపాజిట్‌లు సేక‌రించిన ముఠా ఇప్పుడు మాయ‌మైంది.

సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు చూసి క‌ళ్యాణి కిడ్నీ కేర్‌కు వెళ్లిన బాధితులు తాము మోస‌పోయిన‌ట్టు గుర్తించారు. ఈ వ్య‌వ‌హారంపై ఈ రోడ్ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. హైద‌రాబాద్ కేంద్రంగా మోసం జ‌రిగిన‌ట్టు పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. త‌మ‌కు, ఫేస్‌బుక్‌కు యాడ్‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో కిడ్నీ ఇచ్చేందుకు వెళ్లిన వంద‌లాది కుటుంబాలు షాక్‌కు గుర‌య్యాయి.