ఇంత‌కీ పెంపుడు కుక్క‌లు ఎవ‌రు నాని..?

0
176

ఏపీ టీడీపీలో ట్వీట‌ర్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. ట్వీట‌ర్ వేదికగా ఎంపీ కేశినేని నాని మరోసారి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌లాంటి వాళ్లు పార్టీకి వ‌ద్ద‌ని మీరు భావిస్తే వెంట‌నే తొల‌గించండి అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్ర‌బాబుకు ట్వీట్ చేశారు. అలా చేస్తే వెంట‌నే తాను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి, టీడీపీ స‌భ్య‌త్వాన్ని ఉప‌సంహ‌రించుకుంటాన‌ని కేశినేని నాని త‌న ట్వీట‌ర్‌లో పేర్కొన్నారు.

ఇంకా కేశినేని నాని త‌న ట్వీట‌ర్‌లో.. త‌నలాంటి వారు కావాల‌నుకుంటే మీ పెంపుడు కుక్క‌ల‌ను కంట్రోల్ చేయండి అంటూ కేశినేని నాని అన‌డం గ‌మ‌నార్హం. అయితే కేశినేని నాని ఉద్దేశ‌పూర్వ‌కంగానే వివాద‌స్ప‌ద ట్వీట్‌లు పెడుతున్నాడ‌ని, పార్టీలోనుంచి వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు చెబుతున్న మాట‌. ఇదే విష‌యాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.