మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్..!

0
300
keerthi suresh acting with chiru next movie

మెగాస్టార్, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుంది. చిరంజీవి నటిస్తున్న సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా ఖరారు అయిందని సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రను ‘సైరా’ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ‘సైరా’ చిత్రీకరణ దాదాపుగా చివారి దశకు వచ్చేసిందట. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక నెల రోజులు విశ్రాంతి తీసుకొని తరువాత కొరటాల శివ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకొని షూటింగ్ మొదలు పెట్టుటకు సిద్ధంగా ఉన్నారట శివ. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాను దాదాపుగా జూన్ నుంచి మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో నయనతార, అనుష్క లాంటి హీరోయిన్ లు నటిస్తున్నట్లు పేరు వినపడింది.కానీ ఎలాంటి అధికారకంగా ప్రకటన రాలేదు. తాజాగా ఈ చిత్రంలో మెగా స్టార్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కీర్తి సురేష్ తో పాటు మరో హీరోయిన్ కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో హీరోయిన్ గా శృతి హాసన్ అనుకుంటున్నారట.

‘నేను శైలజ’ అంటూ టాలీవుడ్ లోకి అడుగిడిన ముద్దు గుమ్మ కీర్తిసురేష్. ‘మహానటి’ బ్లాక్ బస్టర్ సాధించి, నటనతో అభిమానుల్ని మైమరపించింది. అంతే ఇక ఈ క్రేజ్ తోనే మెగా సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. మరో పక్క బాలీవుడ్ లో భారత ఫుట్‌బాల్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీం’ జీవిత చరిత్రను దర్శకుడు అమిత్ శర్మ తెరకెక్కిస్తున్నారు. అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీంగా ప్రధాన పాత్రలో నటించగా, అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కీర్తి సురేష్ స్టార్ హీరోల పక్కన నటించే లక్ తోక తొక్కిందని ఇండస్ట్రీ కోడై కూస్తుంది.